పల్లె
ఎటు పోతుంది పల్లె గమనం. మానవ శక్తి మీద లేదు నమ్మకం యంత్ర శక్తి మీదే సదా ఆధారం. మనిషినే నమ్మలేని సమాజం. పల్లె అంతా పట్టణంలో కాపురం. పట్టెడు అన్నం పెట్టే పంటపొలాలే పరదాలు కట్టిన రెండు అంతస్తుల భవంతులు. ఎక్కడుంటాయి పంట గింజలు. ఎలా బతుకుతాయి పక్షి జాతులు. గదులన్ని కంపెనీ సంచులతో బియ్యం. గాదులన్నీ మాసిన బట్టల కంపు. గుమ్మ పాలు తాగే రైతుకు బొమ్మ పాలే గతి. పశువులు కొట్టాలన్ని పాత సామాన్లుకి ఆతిథ్యం. మురికిపట్టిన లేగ దూడల మువ్వల గంటలు. మాయమైన మైసూర్ ఎడ్లు పరుగులు. తుమ్మ నాగళ్ళు చూరు కింద చేరే నాగలి చెక్కే వీరన్న బతుకు గుడిమెట్ల పాలు. వరి దుబ్బు పీకలన్ని యంత్రమే నరికే కొడవలి కోత మరిచి పాత ఇనప ముక్కగా మారే. చెవులు కుట్టే చలమయ్య చెన్నై పట్నం జేరే. కుట్లు లేక చంటి దాని చెవులు బోసి పోయే. గుడ్డ తడిపి కుట్టే దర్జీ గూడూరు పోయే రెడీగా దొరికే madelu వుతుకులో వెలవెలపోయే వృద్ధ దంపతుల గూడు వెల్లలేక మాసిపోయే. ఎల్లలు దాటి వెళ్లలేక గూడులోనే గువ్వలు మగ్గిపోయే. ఆదరణ ఆప్యాయతలకు పెట్టింది పేరు పల్లెటూరు. పల్లె జనం నోరు మరచి చరవాణిలో పలకరించే. గుడిగంటలు దూరమయ్యే సెల్లు గంటలుతో పల్లె అంత మ్రోగే. విస్...