శ్రీకృష్ణ లీలలు
నల్లటి శరీరం, కమలo వంటి కళ్ళు, ఆ కళ్ళల్లో కృపారసం చేతిలో వేణువు, తల మీద పరిసర్పిత పింఛo ,ఎప్పుడూ నవ్వుతూ విరాజిల్లే మొహం. ఇది పోతన గారి శ్రీకృష్ణుడి వర్ణన. ఆ వర్ణన చదువుతుంటేనే మన మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడి ని మనం చూడలేకపోయినా వెన్నదొంగగా ఒక రాధాకృష్ణుడిగా అల్లరి కృష్ణుడిగా చిత్రపటంలో చూసినప్పుడు మనసుకు పదేపదే ఆ ముగ్ద మోహన రూపాన్ని చూడాలని అనిపిస్తుంది . సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మతో సమకాలీకులుగా పెరిగిన ఆ యాదవులు ఎంతటి అదృష్టవంతులో అనిపిస్తుంది. నిజమే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ తో స్నేహితులుగా మెలిగిన యాదవులు చాలా ధన్యాత్ములు. అంటే భగవంతుని పక్కనే ఉండి తమ స్నేహితుడే భగవంతుడు అని తెలియని వాళ్లు. లోకంలో అధర్మం పెరిగినప్పుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తుతూ వచ్చాడు. ఇలా ఒకసారి అధర్మం పెరిగినప్పుడు భూదేవి ఆ రాక్షస కృత్యాలను తట్టుకోలేక బ్రహ్మ దేవుడికి మొరపెట్టుకుంటుంది.. అప్పుడు బ్రహ్మదేవుడు భూమాతను వెంటబెట్టుకుని విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. రాక్షస సoహారం చేయడానికి విష్ణుమూర్తి తాను శ్రీకృష్ణుడిగా దేవకీదేవ...