ఇంటి స్థలం కొనుగోలులో జాగ్రత్తలు మెలుకువలు
ప్లాట్ కొనుగోలులో మెలకువలు మరియు జాగ్రత్తలు పొదుపు చేసిన డబ్బుతో గృహ నిర్మాణం కోసం ప్లాట్ కొనడం జీవితంలో ఒక గొప్ప నిర్ణయం. కానీ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎన్నో చిక్కుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. కనుక, ప్లాట్ కొనుగోలులో కొన్ని ముఖ్యమైన మెలకువలు, జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. 1. టైటిల్ డీడ్ పరిశీలన ప్లాట్ యజమానుడికి సరైన హక్కులు ఉన్నాయా తెలుసుకోవాలి. పాత హక్కు పత్రాలు (Link Documents) పూర్తి స్థాయిలో పరిశీలించాలి. 2. ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (EC) తీసుకోవడం గడిచిన కనీసం 15-30 సంవత్సరాల వరకు Encumbrance Certificate తీసుకొని, భూమిపై ఏమైనా బాకీలు లేదా కేసులు ఉన్నాయా తెలుసుకోవాలి. 3. లేఅవుట్ అప్రూవల్స్ ప్లాట్ ఉన్న లేఅవుట్‌కు DTCP లేదా సంబంధిత Municipality నుంచి అధికార అనుమతి ఉందా లేదా అనే విషయం నిర్ధారించుకోవాలి. 4. రెవెన్యూ రికార్డుల పరిశీలన Adangal, 1B, FMB Sketch వంటి ప్రభుత్వ పత్రాలు సరిగా ఉన్నాయా చూడాలి. రెవెన్యూ శాఖలో ప్లాట్ వివరాలు ఎవరి పేరుతో ఉన్నాయో తెలుసుకోవాలి. 5. సర్వే మరియు బౌండరీ వెరిఫికేషన్ ప్లాట్ పరిమితులు సరిగా ఉన్నాయా పక్క ప్లాట్ల వారితో కలిసి సరిచూడటం మంచిది. 6. రహ...