మా ఊరి గణపతి
మా ఊరి గణపతి వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకారేషు సర్వదా" ఏ శుభకార్యం ప్రారంభించాలన్న గణపతి పూజ తోటే ప్రారంభం. గణపతికి చేసే ప్రత్యేక పూజ కూడా గణపతి ప్రార్ధన తోటే ప్రారంభం. విఘ్నేశ్వరుడు అన్ని గణాలకు అధిపతి. విఘ్నాలను తొలగించేవాడు. అందుకనే ఆది పూజలు అందుకుంటున్నాడు. భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుడు జన్మదినం. ఆ రోజున వినాయక చవితి పండగ చేసుకుంటాం. ఈ పూజ ప్రతి ఇంటిలో కార్యాలయంలో దుకాణాల సముదాయాల్లో గుడిలో ప్రతి వీధిలో ప్రతి వాడలో కూడా చేసుకునే పండుగ. పండగ వారం రోజులు ముందు నుంచే ఆ వీధిలో ఉండే వినాయక ఉత్సవ కమిటీ వారు వీధి వీధినా తిరిగి చందాలు వసూలు చేసి పందిళ్లు వేసి మైకులు పెట్టి ఉత్సవాలు అందంగా జరుపుతారు. మా స్వగ్రామమైన కాజులూరు మండలంలోని పల్లిపాలెం లో కూడా ప్రతి ఏటా ఈ ఉత్సవాలు జరుపుతారు. రెడ్డి సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్న మా గ్రామంలో ఈ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో నాకు తెలియదు. ఈనాటి కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా వినికిడి. ఆ రోజుల్లో వారం రోజులు ముందు నుంచి చవితి హడావుడి ప్రారంభం అయ్యేది. మా చిన్నతనంలో తొలిరోజు మధ్యాహ్నం స్కూల్ కి సె...