పోస్ట్‌లు

కళా లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కళాతపస్వి

కళాతపస్వి.  శ్రవణేంద్రియముల ద్వారా మనసుకు ఆనందం కలిగించేది సంగీతం. స్వరబద్ధమైన సంగీతం మనుషులందరినీ కాదు ప్రాణులన్నింటిని కూడా ఆనందపరుస్తుంది. ఆ సంగీత ప్రధానంగా చిత్రాలు తీయడమే ఒక కత్తి మీద సాము. అయినా అది ఒక మహా దర్శకుడు కి అభిరుచి. సినిమా పేర్లు కూడా వరుసగా స అనే అక్షరంతో ప్రారంభించిపెట్టడం కూడా అరుదైన విషయం. ఆ దర్శకుడు ఎవరో కాదు కళాతపస్వి. సంగీత ప్రధానంగా ఉన్న చిత్రాలు తీయడమే మన విశ్వనాథుడికి వెన్నతో పెట్టిన విద్య. ఎంతోమంది దర్శకులు ఉన్నారు. కొద్ది మంది మాత్రం కలకాలం మన మదిలో నిలిచిపోతారు. కులం గోత్రం మనకు అవసరం లేదు. ప్రేక్షకుల గుండెను దోచుకున్నాడా లేదా అన్నదే ప్రశ్న. తొలి సినిమాతో తెలుగు కళామతల్లి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి బంగారు నందిని కూడా తన వాకిట్లో కట్టేసుకున్నాడు. విప్లవ రచయిత శ్రీశ్రీ గారి చేత ప్రేమ పాటలు రాయించేసాడు. ఒక మూగ పిల్ల చేత నాట్యం చేయించి ఝుమ్మంది నాదం అంటూ తెలుగు కళామతల్లి దర్శకులలో సిరిసిరి మువ్వగా నిలిచాడు. ఎప్పుడూ ఖాకీ దుస్తులలో కనిపించే కళా కార్మికుడు. పొట్ట చించితే అక్షరం ముక్క రాదు అయినా సినిమా మీద మోజుతో మాయమాటలు నమ్మి పట్నం చేరిన ఒక మహాలక్ష్మి కథ. సీ...