పోస్ట్‌లు

అక్టోబర్ 11, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

పాపం సత్తయ్య

పాపం సత్తయ్య ! ఉదయం నుంచి కుండ పోతగా వర్షం పడుతోంది. రోడ్డు మీద ఎక్కడ చూసినా మోకాలు లోతు నీళ్లు. అప్పుడే నిద్ర లేచిన సత్తయ్య గబగబా గొడుగు వేసుకుని తన రేకుల షెడ్డు దగ్గరికి పరిగెత్తాడు. ఒక్కసారిగా ఆ రేకుల షెడ్డులో ఉన్న బొమ్మలు చూసేటప్పటికి సత్తయ్య గుండె గుభేలు మంది. ఆ రేకుల షెడ్ లో పూర్తిగా తయారైన వినాయకుడు బొమ్మలు ,సగం వరకు తయారైనవి, ఇంకా ముడి సరుకు రకరకాల దేవతల బొమ్మలు అన్ని నీటిలో మునిగిపోయి ఉన్నాయి. ఒకసారి సత్తయ్యకి నీరసం వచ్చేసింది. ఒక్కసారిగా నాలుగు రోజుల్లో వస్తున్న వినాయక చవితి పండుగ కోసం డెలివరీ చేయవలసిన బొమ్మలు, పుచ్చుకున్న అడ్వాన్స్ అమౌంట్లు ,షావుకారు దగ్గర ముడిసరుకు కోసం ఇవ్వవలసిన ఎమౌంటు ,అలాగే వినాయక చవితి ఉత్సవాల కమిటీ వారికి ఏం సమాధానం చెప్పాలి ?అని ఒక్కసారిగా గుర్తుకొచ్చి కళ్ళు తిరిగినట్లు అయింది.  అదేమిటి మహానుభావా! పది రోజుల ముందుగానే నిమజ్జనం అయిపోయావు. పూజా పునస్కారం ఏమీ అందుకోకుండానే , వినాయక చవితి ఉత్సవాలు జరగకుండానే అనుకుంటూ వినాయకుడి ని తలుచుకుని మదన పడిపోసాగాడు సత్తయ్య.  సత్తయ్య తాత తండ్రుల కాలం నుంచి బొమ్మలు తయారు చేయడమే వారి వృత్తి. రోడ్డు పక్క...

మర్యాద

మర్యాద పెళ్లి మండపం అందంగా మెరిసిపోతోంది. అది లక్షలు ఖర్చుపెట్టి చేయించిన కళ్యాణమండపం కాదు. అందంగా తోటలో దొరికే పూలు పళ్ళు కాయలతో తయారుచేసిన కళ్యాణమండపం. అదే పూల మండపం. సుముహూర్తం అయిపోయింది. ఆహ్వానితులంతా వధూవరులందరినీ ఆశీర్వదించారు. పంతులుగారి అనుమతి తీసుకుని కామేశ్వర రావుగారు భార్యతో కలిసి ఆహ్వానితులందరినీ పలకరించి వియ్యంకుడు గారి దగ్గరకు వెళ్లి" బావగారు శుభ ముహూర్తం అయిపోయింది కదా భోజనాలు ప్రారంభిస్తాం లేదంటే అందరూ వెళ్ళిపోతారంటూ చెప్పి వియ్యాలవారి పర్మిషన్ తీసుకుని తమ్ముడు నీ భార్యని పిలిచి వచ్చిన అతిథులకు స్నేహితులకి వియ్యాలవారికి బొట్టు పెట్టి భోజనానికి రండి అని గౌరవంగా పిలవండి ఎవరిని మర్చిపోవద్దు. చిన్నపిల్లలకు కూడా చెప్పాలి. ఇది మన ఆచారం అంటూ చెప్పి భోజనాల హాల్లోకి వెళతాడు కామేశ్వర రావు గారు భార్య సుందరితో కలిసి. కామేశ్వరరావు గారు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తున్న మన సాంప్రదాయాలకి ఆచారాలకి పూజలకి పునస్కారాలనీ బాగా గౌరవిస్తాడు. ప్రతి ఇంటికి ఒక ఆచారం ఉంటుంది. అది పెద్దలను చూసి నేర్చుకున్నది. గుమ్మoల్లోకి అడుగుపెట్టిన వ్యక్తిని నవ్వుతూ పలకరించి మంచినీళ్లు తాగుతారా అ...