పోస్ట్‌లు

మే 7, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

చద్దన్నం

చద్దన్నం – పల్లె జీవన శైలిలో ఒక పోషక సంపద అవును, అది కేవలం అల్పాహారం కాదు. అది ఒక జీవనశైలి. ఒక సంప్రదాయం. ఒక ఆరోగ్య రహస్యం కూడా! ఒకప్పుడు గ్రామీణ జీవన శైలిలో ఉదయాన్నే అందరూ తీసుకునే ఆహారం చద్దన్నం. అప్పటి రోజుల్లో కాఫీలు టీలు టిఫిన్లు ఉండేవి కాదు. ఇవి ఉన్నప్పటికీ కొంతమందికి చద్దన్నం తింటే కానీ ఆకలికి ఆగలేకపోయేవారు. ముఖ్యంగా ప్రతి రైతు వంటింట్లో ఒక గిన్నెలో చద్దన్నం, దాని పక్కనే ఉల్లిపాయ ముక్కలు, నంచుకోవడానికి మెంతికాయి లేదా మాగాయి లేదంటే ఏదో ఒక ఊరగాయ తప్పనిసరిగా ఉండి నోరూరించేవి. చద్దన్నం అంటే నిన్నటి ఉడికిన అన్నాన్ని నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయాన చల్లగా తీసుకునే ఆహారం. వేసవి మండుటెండలో పొలంలో పని చేసి వచ్చే రైతుకి ఇది ప్రాణదాయకం. శరీరాన్ని చల్లబరుస్తుంది. అలసటను తగ్గిస్తుంది. ఆకలి తీర్చడమే కాదు, శక్తిని కూడా ఇస్తుంది. ఇది పేదల ఆహారంగా పరిగణించబడినప్పటికీ, చద్దన్నంలో దాగిన ఆరోగ్య విలువలు అనేకం. నానబెట్టిన అన్నంలో ఫెర్మెంటేషన్ వల్ల బీ-విటమిన్లు (B vitamins), ముఖ్యంగా బీ-12 అభివృద్ధి అవుతాయి.  ఇవి జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. అంతేగాక, ప్రోబయోటిక్స్‌ ద్వారా పేగులకు అవసరమైన ...

ఇన్కమ్ టాక్స్

 2025–26 ఆర్థిక సంవత్సరానికి మారిన ఆదాయపన్ను విధానం: కీలక మార్పులు 2025 ఏప్రిల్ 1 నుంచి ఆదాయపన్ను విధానం లో కొన్ని కీలకమైన మార్పులు అమలులోకి వస్తున్నాయి. ఈ మార్పులు ప్రత్యేకంగా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ మార్పులు, పన్ను మినహాయింపులు, మరియు కొత్త స్లాబ్‌లు ఏమిటి అన్న విషయాలను ఈ బ్లాగులో వివరించాం. 1. కొత్త పన్ను విధానం: 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయపన్ను విధానం లో ₹12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ మినహాయింపు Section 87A rebate ద్వారా అమలవుతుంది. ఇది పాత విధానం కంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే పన్ను చెల్లించాల్సిన బాధ్యతను తగ్గిస్తుంది. 2. పన్ను మినహాయింపు: 2025–26 ఆర్థిక సంవత్సరం నుండి ₹5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపు లభిస్తుంది. Section 87A ద్వారా ₹12,500 వరకు మినహాయింపు లభించవచ్చు, దీనివల్ల వారు ఏ రకమైన పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉంటారు. 3. కొత్త పన్ను స్లాబ్‌లు: కొత్త పన్ను విధానం ప్రకారం, పన్ను స్లాబ్‌లు క్రింద ప్రస్తావించిన విధంగా ఉంటాయి: ఆదాయం శ్రేణి (₹) పన్ను రేటు (%) ...

అమ్మ ఎవరికైనా అమ్మే

అమ్మ ఎవరికైనా అమ్మే ఉదయం 5 గంటలు అయింది. శీతాకాలం కావడంతో మంచు వానలా కురుస్తోంది. ప్రతిరోజు 5 గంటలకు లేచే సీతమ్మ గారు నిద్రలో నుంచి మెలకువ వచ్చినా శీతాకాలం కావడంతో బద్ధకంగా కళ్ళు మూసుకుని అలాగే మంచం మీద పడుకున్నారు. ఇంతలో అంబా అంటూ దొడ్డి వైపునున్న మట్టి వసారా లోంచి రాము గాడి అరుపు వినిపించింది. పాపం వీడికి ఆకలిఅనుకుంటూ సీతమ్మ గారు గబగబా మంచం మీద లేచి మొహం కడుక్కుని స్టవ్ వెలిగించి పాలు పొయ్యి మీద పెట్టారు.  పాలు కా గిన తర్వాత చల్లారి పెట్టేంతలో మరోసారి అంబా అంటూ అరుపు వినిపించింది. సీతమ్మ గారు గబగబా పాలు సీసాలో పోసి పాలతిత్తి పెట్టి మట్టివసారలోకి అడుగు పెట్టారు. సీతమ్మ గారిని చూడగానే రాము గాడు అటు ఇటు తిరుగుతూ తోక ఊపుకుంటూ హడావిడిగా ఉన్నాడు. ఏరా రాము ఆకలవుతుందా అoటూ సీతమ్మ గారు పాలసీసాని రాము గాడు నోట్లో పెట్టారు. రాము గాడు రెండు గుక్కలు తాగిన తర్వాత తలపైకెత్తి సీతమ్మ గారి తల మీద పెట్టి గారాలు పోతున్నాడు. ఇంకా కొద్దిగానే ఉన్నాయి రా ఇవి పూర్తిగా తాగెయ్యి. లేదంటే ఆకలి వేస్తుంది అంటూ రాము గాడి ఒళ్లంతా నిమురుతూ దగ్గరగా తీసుకుని మళ్లీ పాలసీసాలోని పాలని తాగించేశారు. రాము గాడు పాలు...