మాజీ కార్మికులు
మాజీ కార్మికులం. మనం కార్మికులం జనం మర్చిపోయిన మాజీ కార్మికులo ఒకప్పుడు దేశ ప్రగతిలో మనము భాగస్వామ్యులం ప్రజా సేవలో మనం అతి ముఖ్యమైన ఆర్థిక రంగం కార్మికులo. మారే ప్రభుత్వాల ఆశయాలకి ఓట్ల కోసం తెచ్చే పథకాల అమలుకి మనం బలి పశువులo. సబ్సిడీ రుణాలు సంతోషంగా ఇచ్చాం వసూలు కి కాళ్లు అరిగేలా తిరిగాo పెద్ద నోట్లను మడిచి లోపల పెట్టాం. కరోనాకాలంలో కష్టమనిపించిన బ్యాంకు తలుపులు తెరిచే ఉంచాo. దొంగల తో పాటు కరోనా కూడా మన అతిధిలా వస్తే సేవ చేసి ప్రాణాలు కోల్పోయాం. వేల కోట్లు మాఫీ చేశాం అవమానాలు ఎదుర్కొన్నాం ఎదురు దెబ్బలు తిన్నాం చేయని తప్పుకు చెప్పు దెబ్బలు తిన్నాం. శిక్షలు అనుభవించాం. అందరూ వైట్ కలర్ జాబ్ అంటారు అది నైట్ వరకు సాగే బ్యాంకు జాబు లెక్కల లోనే పని వేళలు లెక్కకు రాని వేళలు ఎన్నో వారాంతపు సెలవులలో కూడా బ్యాంక్ వాకిట్లోనే. భార్య పిల్లల ఎంజాయ్ మెంట్ నట్టింట్లోనే. కరోనా వచ్చినా లాక్ డౌన్ పెట్టినా మన కార్యాలయం ఎప్పుడు కళ కళే. అంతా ...