మాజీ కార్మికులు
మాజీ కార్మికులం.
మనం కార్మికులం
జనం మర్చిపోయిన మాజీ కార్మికులo
ఒకప్పుడు దేశ ప్రగతిలో
మనము భాగస్వామ్యులం
ప్రజా సేవలో మనం
అతి ముఖ్యమైన ఆర్థిక రంగం కార్మికులo.
మారే ప్రభుత్వాల ఆశయాలకి
ఓట్ల కోసం తెచ్చే పథకాల అమలుకి
మనం బలి పశువులo.
సబ్సిడీ రుణాలు సంతోషంగా ఇచ్చాం
వసూలు కి కాళ్లు అరిగేలా తిరిగాo
పెద్ద నోట్లను మడిచి లోపల పెట్టాం.
కరోనాకాలంలో కష్టమనిపించిన
బ్యాంకు తలుపులు తెరిచే ఉంచాo.
దొంగల తో పాటు కరోనా కూడా
మన అతిధిలా వస్తే
సేవ చేసి ప్రాణాలు కోల్పోయాం.
వేల కోట్లు మాఫీ చేశాం
అవమానాలు ఎదుర్కొన్నాం
ఎదురు దెబ్బలు తిన్నాం
చేయని తప్పుకు చెప్పు దెబ్బలు తిన్నాం.
శిక్షలు అనుభవించాం.
అందరూ వైట్ కలర్ జాబ్ అంటారు
అది నైట్ వరకు సాగే బ్యాంకు జాబు
లెక్కల లోనే పని వేళలు
లెక్కకు రాని వేళలు ఎన్నో
వారాంతపు సెలవులలో కూడా బ్యాంక్ వాకిట్లోనే.
భార్య పిల్లల ఎంజాయ్ మెంట్ నట్టింట్లోనే.
కరోనా వచ్చినా లాక్ డౌన్ పెట్టినా
మన కార్యాలయం ఎప్పుడు కళ కళే.
అంతా యంత్రాల మయం.
On-line ల వ్యాపారం..
ఏ తీగ ఎక్కడ పుటుక్కుమన్న లావా దేవీ లన్నీ బందులే.
కోర్ బ్యాంకింగ్ కోరల మధ్య నలుగుతున్న ఉద్యోగులు.
సంతృప్తి లేని కస్టమర్ దేవుళ్ళు.
సమాధానం చెప్పుకోలేని అధికారులు.
మౌనం వహించిన యాజమాన్యాలు.
అంతా ఆన్లైన్ అంటారు
కానీ ముందుకు కదలదు లైను
రోజుకో టార్గెట్ పూటకో మీటింగ్
టార్గెట్ సాధిస్తే రేటింగ్.
ఆది నుంచి వచ్చే అనువంశిక బ్యాంకింగ్
కొండెక్కిపోయింది.
ఎక్కడి నుంచి వచ్చిందో
అధునాతన బ్యాంకింగ్
ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్ సెల్లింగ్
కస్టమర్కి అర్థం కాని మన మార్కెటింగ్
ఇలా సాగింది ముప్పై ఏళ్ళ జీవితం
పెన్షనర్ గా జీవితం టెన్షన్ లేని జీవితం
అనుకుంటే పెరిగే ద్రవ్యోల్బణం
మారని పెన్షన్ అదే మన టెన్షన్
ఇన్న్నాళ్ళు పనిచేసిన కార్యాలయం.
ఎవరో కొత్తగా వచ్చారని చూస్తోంది
మంత్రిగారి టేబుల్ మీద పెన్షన్ ఫైలు
దుమ్ము కొట్టుకుపోయింది.
కోర్టులో వాద ప్రతివాదనలతో
కాలం గడిచిపోతుంది
పూర్వాశ్రమంలో జోనల్ మేనేజర్
పెన్షన్ చూస్తే బెత్తెడు
అదే అడుగుతున్నారు
జనం మర్చిపోయిన కార్మికులు.
ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఆశాజీవులు
మసక బారిన కన్నులతో ఎదురుచూసే
మాజీ కార్మికులం
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి