పోస్ట్‌లు

చినుకులో సాయం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

చినుకులో సాయం

నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా రెండు రోజులు స్కూళ్లు, కాలేజీలన్నిటికీ సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి తిరగవద్దు అనే వార్తలు విని పిల్లలు ఎగిరి గంతేశారు. వాళ్లకేం తెలుసు పాపం! నగరంలోని పరిస్థితి. గుమ్మం బయట కాలు పెట్టకపోతే ఎవరికీ బ్రతుకు జీవనం గడవదు. అందులో ఈ ఏడాది మరీ ఎక్కువగా కురుస్తున్నాయి వర్షాలు. దానికి తోడు ట్రాఫిక్ జాము, వర్షపు నీరు ఎక్కడికి కదులకుండా ఉండిపోవడం. రోడ్డుమీద ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియట్లేదు. ఆఫీసుకి వెళ్లి రావడం అంటే తల ప్రాణం తోక వచ్చినట్టే ఉంది. “ఎలాగురా బాబు, ఈ వర్షంలో సెలవు పెట్టమంటే బాసు ఊరుకోడు” అనుకుని బాధపడుతూ, రైన్‌కోట్ వేసుకుని బయలుదేరబోతుంటే, గుమ్మం దగ్గర ఆటో ఆగిన శబ్ధం వినిపించింది. “ఎవరబ్బా ఈ వర్షంలో?” అనుకుంటూ బయటికి వెళ్లాడు. ఆటో డ్రైవర్ రాజు నమస్కారం చేసి, “ఇవాళ సెలవు కదా సార్?” అని అడిగాడు. “సెలవే రాజూ, మరి బేరాలు ఏమీ లేవా?” అని రామారావు. “లేదు సార్… ఇంటిదగ్గర కష్టంగా ఉంది,” అంటూ చేతులు నులిపాడు రాజు. రామారావుకి విషయం అర్థమైంది. ప్రతినెల ఒకటో తారీకు రాకుండానే జీతం మధ్యలో పట్టుకెళ్తుంటాడు. అలాంటిది, ఈ వర...