పోస్ట్‌లు

సాయంకాలం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సాయంకాలం సాగర తీరం

ఆ ప్రదేశంలో అంత ఆకర్షణ శక్తి ఏముంది? సాయంకాలం అయిందంటే చాలు అందరికి వయోభేదం లేకుండా ఆ ప్రదేశానికి వెళ్లాలని మనసు పీకుతుంది. ఒక్కసారి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముందో తెలిసిపోతుంది కానీ మాటిమాటికి అదే ప్రదేశం వెళ్లాలని అనుకుంటారు. అంత సమ్మోహన శక్తి ఏముంది అక్కడకు మనము వెళ్లి చూద్దాం. నడుచుకుంటూ వెళితే కాళ్లు కూరుకుపోయే ఇసుక, తీరానికి అలుపు సొలుపు లేకుండా కొట్టుకొచ్చే కెరటాలు ,ఏది తనలో దాచుకోకుండా ఒడ్డు మీదకి విసిరేసే ఆ సముద్రుడు , అది మంచి సరుకో తెలియదు మాయ సరుకో తెలియదు అయినా ఎక్కడినుంచో విదేశాల నుంచి సరుకు మోసుకుని నాలుగు రోజులపాటు ఆ బరువు బాధ్యతలు దింపుకోవడానికి అక్కడ సముద్రంలో రెస్ట్ తీసుకునే పెద్ద పెద్ద పడవలు, మన సరుకు విదేశాలకు రుచి చూపించడానికి తీసుకుపోయే పెద్ద పెద్ద పడవలు ,నిండుగా పదేళ్లు కూడా ఉండవు అయినా బ్రతుకు సమరంలో పాట్లు పడే పిల్లవాడు చిన్న పడవ నడుపుతూ వలలో చిక్కే చేప కోసం కెరటాలకు ఎదురు తిరుగుతున్న దృశ్యం, కొంతమంది ఆ నీళ్లలో జలకాలాడే సన్నివేశం.  అరుపులు గోలలు ఈలలు కేకలు ఒకటేమిటి అది ఒక పెద్ద మార్కెట్ లా ఉంటుంది .ఎవరి మాట ఎవరికీ వినపడదు. భూభాగంలో మూడు వంతులు జలమే ఆక్ర...