పోస్ట్‌లు

ఆగస్టు 19, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

నా జ్ఞాపకాల కాకినాడ

కాకినాడ మా ఊరండి. ఆ పేరు వినగానే మనసంతా ఏదో అయిపోతుంది. జగన్నాధపురం బ్రిడ్జి దాటగానే మన కాకినాడ పాత జ్ఞాపకాలు ఒక్కసారి సినిమా రీలులా గిర్రున తిరుగుతాయి. అప్పట్లో అలా ఉండేది. ఎప్పుడో విదేశీయులు కాకినాడ వచ్చి కోకల వ్యాపారం మొదలుపెట్టారుట. వ్యాపారం అంటే చీరలు అమ్మడం కాదు, చీరలు ఎగుమతి. చుట్టూ విశాలమైన బంగాళాఖాతం ఉండగా చేపలు పట్టడం మానేసి కాకినాడలో ఈ కోకల వ్యాపారం ఎందుకు ఎంచుకున్నారో ఆ విదేశీయులు డచ్ వారు. అప్పటినుంచి కాకి నందివాడ కోకనాడగా మారిపోయింది. ఇప్పటికీ రైల్వే డిపార్ట్మెంటు వారికి కోకనాడ పేరు మరచిపోలేదు. అది అలానే కంటిన్యూ అవుతోంది. ఆ విదేశీయుల నామకరణం వాడుకలో కాకినాడగా మారిపోయింది. కోకనాడ అతి పురాతన నగరం. తూర్పున బంగాళాఖాత సముద్రం ఓడరేవుగా మారి ఎగుమతలకు సహాయం చేస్తూ మధ్యలోని హోప్ ఐలాండ్ నగరాన్ని ముంపు నుండి కాపాడుతోంది. అందాల నగరం లోపల అందమైన రోడ్లు, మంచి మంచి పార్కులు, మంచి మంచి కాలేజీలు, మంచి స్కూల్స్ ఎన్ని ఉండేవో! అప్పట్లో కాలేజ్ అంటే గుర్తుకొచ్చేది పి.ఆర్. కాలేజ్ అండి. ఈ కాలేజీలో చదువుకుని ఎంతోమంది కలెక్టర్లు, డాక్టర్లు, నాయకులు, ఇంజనీర్లు, యాక్టర్లు అయిపోయారు. కాకినాడ ప్రజలు ...