పోస్ట్‌లు

పల్లెలు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పల్లెలు

పల్లెటూరు అందాలకు ఆలయం.  అనుబంధాలకు నిలయం.  రక్తసంబంధం లేకపోయినా ఆప్యాయంగా పిలుచుకునే ఆనంద కుటుంబం. సాయం అంటే ముందుకు అడుగు వేసే జనం సహాయం అంటే అందరికంటే ముందుండే మన ఊరే కరుణాసముద్రం. బాధ్యత అంటే బరువు అని తలచని అనుబంధం. చుట్టూ పరికిస్తే అనుక్షణం బాధ్యత గుర్తు చేయడం  ఓ వరం.  గంప కింద నుంచి కోడి కూతతో ఊరి మత్తు బహుదూరం.  ఇంకా ముసుగు తీయకపోతే జీవన పోరాటంలో తీరం వెతుక్కునే పక్షి వెక్కిరింపుతో పౌరుషం. గుడిలో నుంచి వినపడే సుప్రభాతం తెల్లవారింది అనడానికి సంకేతం. ఎర్రటి చూపులతో చుర్రుమనిపించే సూర్యకిరణం. అంబా అనే మూగజీవి అరుపు తన బిడ్డ ఆకలి తీర్చమని గుర్తు చేయడం పక్కన తడిమి చూస్తే వెక్కిరించిన మంచం.  వాకిట్లోంచి కళ్ళాపి జల్లుతున్న శబ్దం.  కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా రహదారిపై సహచరుల జీవన ప్రయాణం.  అరుగు మీద చంటిగాడి చేతిలో పాఠ్యపుస్తకం. ఆ వేపుకు తిరిగి రెండు చేతులు జోడిస్తే బారెడు పొద్దెక్కిందని మనసులో ఓ భయం. పెరటిలోని వేపచెట్టు మూలనున్న దిగుడు బావి ఆరోగ్యానికి అభయం. వాకిట్లో కోడి పిల్లలకి ఆహారం వెతుకుతూ విహారం.  నక్కి నక్కి చూస్తున్న నల్ల పిల...