పిచిక గూడు
పిచిక గూడు ఈ లోకంలో ఏ ప్రాణి కూడా తన గూడు తానే సొంతంగా నిర్మించుకోలే దు. మాట తెలిసిన మానవుడు కూడా అన్నీ ఉండి నిపుణులైన వారి మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ ఒక్క పక్షి జాతి మాత్రం తన గూడు తానే నిర్మించుకుంటుంది. గూడు ఈ విధంగా ఉండాలని, నిర్మించాలని ఎవరు నేర్పారు ఈ మాటలు రాని పక్షికి. ఒక్క భగవంతుడు తప్పితే ఇంకెవరు చెప్తారు. ఒక మనిషి ఇల్లు కట్టాలంటే ప్రభుత్వం వారి అనుమతితో పాటు, శాస్త్ర సమ్మతము కూడా అయి ఉండాలి. ప్రతి మనిషికి కొన్ని కలలు ఉంటాయి. ఆ కలల ప్రకారం తన స్వర్గం నిర్మించుకోవాలని తాపత్రయ పడిపోతుంటాడు. మనిషికి ఆశకి అంతులేకుండా పోయింది. మూడు గదులలో సంసారం చేసే కుటుంబాలు రెండు పడకగదులతో ఇల్లు ఉండాలని అది కాకుండా ఎవరు పడకగది వాళ్ళకు ఉండాలని అది కాకుండా ఆధునిక కాలంలో జనం మెచ్చే విధంగా డూప్లెక్స్ కట్టుకోవాలని ఇలా రోజురోజుకీ మనిషి కోరికల సముద్రంలో కొట్టుకుపోతూ ఉన్నాడు. చివరికి మిగిలేది ఇద్దరే ఆ ఇంట్లో. చివరికి తన స్వర్గాన్ని శుభ్రం చేసుకునే ఓపిక కూడా ఆ మనిషికి ఉండదు. ఆ పక్షికేముంది చెట్టు కొమ్మ ఉంటే చాలు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా గూడు నిర్మించేసుకుంటుంది. ఆ పక్షి జాతి తరతర...