పోస్ట్‌లు

ఆగస్టు 2, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

బొమ్మ చెప్పిన కథ

చిత్రం
గతం తలుచుకుంటే నాకెంతో గర్వం.భవిష్యత్తు నాకు ఆశాజనకం.వర్తమానం మీకు కళ్ళ ముందు కనిపించే చిత్రం. ఇది నా బ్రతుకు బతుకు అంతా నిత్యం సమరాలే పంచకల్యాణిలా పరుగులే. రాజు బంటు తేడాయే తెలియదు. దేవుడు దేవత దెయ్యం అందరూ నా యజమానులే కొండలెక్కాను గుట్టల మీద నడిచాను .నదులు దాటాను నడక తక్కువే. పరుగు కోరుకునే వారు ఎక్కువ.నా కళ్ళెం పట్టిన రాజుగారి రాచరికం చరిత్రలో కలిసిపోయింది.రాజు లేకపోతే బంటు కూడా మాయం. కళ్లకు గంతలు కట్టుకుని బండికి సేవకుడి ని అయిపోయా.మారిన కాలం నాలుగు చక్రాల బండి తో నా పొట్ట కొట్టేస్తే నేను సముద్రం ఒడ్డుకు వచ్చి ఇసుకలో పడిపోయా.ఇసుకలో నేను నడక నేర్చుకుంటున్నా. ఇప్పుడు నా కళ్లెం పట్టుకున్న వారికి అది గుర్రపు స్వారీ.సెల్ఫీలు చూసుకుని మురిసిపోతున్నారు.సరదాలు తీర్చుకుంటున్నారు.  ఆ ఉప్పు గాలిలో ఆ ఇసుకలో ఆ కెరటాల హోరులో నన్ను పెంచి పోషిస్తున్నారు. ఒకప్పుడు నేను పంచ కళ్యాణిని ,రాజు గారితో పాటు రాజభోగాలు అనుభవించిన దాన్ని ఇప్పుడు నేను బక్క చిక్కిన గుర్రం @ సముద్రం. గుడ్డ ముక్కల గుర్రాన్ని కేరాఫ్ నచ్చిన వారి ఇంట్లో గూట్లో బొమ్మని. తల పైకెత్తి చూస్తే ఆకాశంలో కనబడే తారని మెరి...

వాచ్ మెన్

మధ్యాహ్నం రెండు గంటలు అయింది. ఆకాశం అంతా దట్టంగా నల్ల మబ్బు పట్టి, ఒకటే ఈదురు గాలులు. "ఏమిటి వర్షం వస్తుందా?" అనుకుంటూ సుమతి కుర్చీలోంచి లేచి, మేడ మీద ఆరవేసిన బట్టలు తీసుకు రావడానికి వెళ్లింది. మేడ మీద ఆరవేసిన బట్టలు తీసుకుని లిఫ్ట్‌లో నాలుగో ఫ్లోర్‌కి వస్తుండగా, చేతిలో సెల్‌ఫోన్ రింగ్ అయ్యింది. "హలో!" అనగానే... "సుమతి! పిల్లలు ఇంటికి వచ్చారా? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? ఇంట్లో సామాన్లు అన్నీ ఉన్నాయా? ఫ్రిజ్‌లో పాలు ప్యాకెట్లు ఎన్ని ఉన్నాయి? కూరగాయలు ఉన్నాయా? పిల్లలకు తినడానికి ఏమైనా ఉన్నాయా?" అంటూ కంగారుగా ప్రశ్న మీద ప్రశ్నలు అడుగుతున్నాడు సుమతి భర్త సుధాకర్. "ఏంటండీ? మీరు ఇలాంటివి ఎప్పుడూ అడగరు కదా! నేనే కదా బజార్‌ నుంచి తెచ్చుకుంటాను," అంటూ నిష్టూరంగా మాట్లాడిన భార్య మాటలకు కోపం తెచ్చుకోకుండా... "నువ్వు టీవీ చూడటం లేదా? రేపు మన విశాఖపట్నానికి చాలా ప్రమాదకరమైన తుఫాను వస్తోంది. సిటీ చాలా హడావుడిగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా తుఫాను ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రేపు అన్ని స్క...