సామర్లకోట
కోట లేకపోయినా మాది సామర్లకోటే.
          
ఆదిలో అది శ్యామలాదేవి కోట.
శ్యామలాoబ గుడి లేని మా కోట సామర్ల కోట.
     ఊరే   పంచారామం,చాళుక్య భీమేశ్వర ఆలయం.
           భక్తకోటికి అదే యాత్రావిహారం.
             కార్తీకమాసం జనసందోహం.
             కరోనా కాలమంతా నిశ్శబ్దం.
పవిత్రతకు ప్రశాంతతకు మాండవ్య 
నారాయణ ఆలయం. 
      ఆదిలోనే   శంకరుల కొలువు
    మధ్యలోని అమ్మ  నూకాలమ్మ.
       పక్కనే సాయి మకాం
   అంత్యం అంతా  ప్రసన్నాంజనేయం.
        అదే మా గ్రామం భీమారామo
    ఆది, అంతం అంతా భగవదత్తం.
తరాలతో పాటు ఆధునికంగా మారిన రైల్వే జంక్షన్.
   హౌరా చెన్నై మార్గం లో ప్రధాన జంక్షన్.
       రైలు ఎదురుగా బస్సుల స్టాపు.
ప్రధాన  నగరాలు  అన్నిటికీ బస్సు సౌకర్యం.
మా కోట వాసులందరికి  గమ్యం  గగనం కాదు.
తరతరాలుగా  యువతకు ఉపాధి ఇస్తున్న 
 ఆయిల్ పరిశ్రమలు .
అంబటి సుబ్బన్న అండ్ కో పప్పు నూనెలు.
రాక్ సిరామిక్లు. సుధా ఆగ్రో ఆయిల్.
చిన్నా చితక పరిశ్రమల ఇండస్ట్రియల్ ఎస్టేట్లు.
ఉపాధితో పాటు సమాజ సేవ .
సార్థక నామధేయం స్టేషన్ రోడ్డు
బోసినవ్వుల గాంధీ బొమ్మ సెంటర్ 
బలుసు  పేట కుమ్మరి వీధి బళ్ళ మార్కెట్
ఆధునికంగా అయోధ్య రామాపురం.
భాస్కర్ నగర్, మెహర్ కాంప్లెక్స్
 గుడి ఉన్న గణపతి నగరం.
అగ్రహారం  కొత్తూరు
మా కోట వాసుల నివాసం . 
కనుమరుగైన సామర్లకోట పంచదార.
వలసపోయిన మాజీ ఉద్యోగులు.
తగ్గిన పరిశ్రమల కాలుష్యం.
పెరుగుతున్న కాలనీల నిర్మాణం.
అన్ని జాతీయ బ్యాంకులు మా కోటలో  మకాం.
మా ఊరు రండి గోధుమ గవ్వలు రుచి చూపిస్తాం.o
కమ్మని పప్పు నూనె  సంగతి చెబుతాం
 పిఎస్ టార్పాలిన్ మడిచి సంచీలోపెడతాం
    విమల డ్రింక్ తో విందు చేసి
శివుని ప్రసాదం పెట్టి  రైలు బండి ఎక్కిస్తాం.
కరోనా తప్పితే కార్పొరేట్ ఆస్పత్రి తలుపు తట్టక్క రలేదు.
      మాకు ఉన్నాయి ప్రభుత్వాసుపత్రులు.
        అవే   మాకు  అత్యవసర రక్షకులు.
        రత్నం రాజు గారు, పద్మనాభం గారు,
         బే తిన వారు  ,శేషగిరి గారు
        మా ఊరి అపర  ధన్వంతురులు.
        ఆరోగ్యం గురించి మాకు ఎందుకు భయం.
         ప్రతిభకు మెరుగు పెట్టే ప్రైవేట్ విద్యాలయాలు.
         వృత్తినే దైవంగా భావించే సాయిరామ కృష్ణమాష్టారు.
         మా పిల్లల విద్యకు మాకేం  భయం.
            అందుకే సామర్లకోటలోని నివాసo
        సాక్షాత్తు గణపతి శాస్త్రి మాకు ఆధ్యాత్మిక గురువు.
         మాకు ఎందుకు ఉంటాయి విఘ్నాలు.
          ప్రతి పని నిర్విఘ్నం. అదే మా ఊరి ప్రత్యేకం.
          వారే చూపించారు ఆంజనేయుని అభయ హస్తం.
          పంచాంగకర్త చీమల కొండ వారి బిడ్డ
          జ్యోతిష్యానికి ఆయన మాకు కొండంత అండ.l
           సినీ నాటకాలరాయుళ్లు రావి కొండల వారు
            మా కోట వారే కావడంకొండంత ఆనందం.
            నాట్యానికి నడక నేర్పిన అలమండ వారు
             అభినందనీయం.
            ప్రతివాది వారి స్వాతంత్రోద్యమ సమరం .
            మా యువతరానికి అదే స్ఫూర్తి.
           ఏమని చెప్పుదు అభిసారిక ఉపయోగం.
            కావలసినంత విజ్ఞానం  యువతరానికి.
               దర్భా వారిదే ఆ పుణ్యం.
             వద్దిపర్తి వారి వచన కవిత్వం.
              ఆంధ్రావని కే అందం.
             మన అగ్రహారీకులు కావడం మన అదృష్టం
          పారిశ్రామికీకరణ  ప్రగతికి మెట్టు.
     చలమయ్య  భూషయ్య ల గారిదే తొలిమెట్టు.
     మా ఊరి యువతకి  అదే ఉపాధి పెట్టు.
             ఉండవల్లి వారు, బొడ్డు వారు.
            మా కోటలో ఉన్న, ఆంధ్రావని ఏలినవారు.
           కరోనా కాటేసిన బొడ్డు వారిని 
             మనo  మరువలేము.
         ఉపన్యాసం అంటే సమయం వీర్రాజుగారు .
         క్రైస్తవ  ప్రచారం అంటే సువార్త రాజు గారు.
          మన ఊరి వారు కావడం మనకు గొప్ప వరం.
        రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
                  కాకినాడ
              9491792279
మన సామర్లకోట గురించి ఎంత గొప్పగా రాసారండీ..
రిప్లయితొలగించండి