సాగరం
సముద్రపు నీళ్లన్నీ ఉప్పుమయం
గొంతు దింపాలి అంటే భయం.
భూభాగంలో మూడొంతులు జలభాగం.
అయినా మనిషికి తీరటం లేదు దాహం.
ఉప్పు నీళ్ళు అయినా అది జలమే
పంచ భూతం లో అది లెక్క లోనే
పంచభూత పరమార్ధం
పరోపకారార్ధం ఇదం శరీరం
చేపల పులుసు అంటే లొట్టలేసుకుని తింటాం.
జలధి నుంచి పుట్టిందే కదా ఆ ఆణిముత్యం.
నీళ్ల మీదే కదా బెస్త వారి బతుకు పోరాటం.
జలరాసులే కదా వారి కాసుల పంట.
కెరటాలే కదా సాగరానికి అందం
వచ్చే కెరటం పోయే కెరటం
మన జీవితంలో కష్టం సుఖం తో సరి సమానం
అయినాతరతరాలుగా సాగుతూనే ఉంది సాగరం.
మనిషి నేర్చుకోవాలి మరింతగా ముందుకు సాగడం.
సాగరఘోష బూడిదలో పోసిన పన్నీరు.
ఆర్చే వారు ఉండరు తీర్చే వారు ఉండరు.
అయినా సాగరం ప్రయత్నం ఆపదు.
అదే కదా మనిషికి స్ఫూర్తి.
సాగరానికి ఏమి తెలుసు తన ఘోష
ఒక స్వరకారుడి స్వరమై నంది పతకాలు అలంకరించుకుందని.
ఒక కవికి మహాకావ్యమై పద్మశ్రీలను అందుకుoదని.
అవార్డులు తెచ్చిపెట్టిన ఒక సినిమాకు పేరు సముద్రం.
బండి నడవాలంటే ఇంధనం కావాలి.
ఇంధనంతోటే మరింత ధనం దేశానికి.
అగాధం నుంచి ఇంధనం మనకందరికీ వరం.
మన చమురు వాయువుల సంస్థ దేశానికే గర్వకారణం.
నిత్యంమన సముద్రుడికి చెయ్యాలి నమస్కారం.
సముద్రపు నీళ్లు ఉప్పు అయితేనేం.
యుద్ధనౌక నడవాలంటే అదే కదా ఆధారం.
దేశ రక్షణకు యుద్ధ నౌకే కదా ప్రాణం.
ఎక్కే సరుకు దిగే సరుకు ల తో విదేశీ మారక ద్రవ్యం.
దేశ ఆర్థిక అభివృద్ధికి అదే వూతం.
విమానయానం అంటే భయo.అందుకే
నౌకా యానం తో గమ్యం చేరచ్చు మరింత చౌకగా.
వాస్కోడిగామా పరదేశి అయినా నిత్య సoస్మరణీయం.
ప్రేయసీ ప్రియులకు నాయికా నాయకుల
ఆటపాటల ఆలవాలము సాగరపు వొడ్డు.
తరతరాలుగా సినిమా షూటింగులకు అదే నడిబొడ్డు.
ప్రతి ఫ్రేములో ప్రతి కెమెరా లో సాగరం నిత్యం కొత్తగా,
బిగించడమే కెమెరామెన్ ప్రతిభకు పట్టం కట్టు.
సాగరపు వడ్డు అంతాపిల్లల కేరింతలతో హోరు.
వాకర్స్ చెమటలన్ని మట్టిలో జారు.
చాట్ బండిల చుట్టూ జనం చేరు.
జనం లేకపోతే వాడి బ్రతుకు బేజారు.
పట్టుమని పదేళ్లు ఉండవు పంచకళ్యాణి పై
స్వారీ నేర్పిస్తాం అంటాడు.
బుడగ లాంటిది జీవితం .
బుడగలు అమ్మితే కానీ జీవితం నడవదు బుడ్డోడికి
వణికే చేతులతో టైంపాస్ బటాని అంటేనే కానీ
బతుకు బండి ముందుకు సాగని అవ్వ
సాగర తీరం బతుకు చిత్రవిచిత్రాల మయం.
జీవితపు సమరానికి ఆలవాలం.
పదిమందికి పట్టెడన్నం పెట్టేది సాగరం
అందుకే అందాం సాగరాన్ని అన్నపూర్ణ అని.
ముత్యాల హారం అమ్మాయికి బానే ఉంటుంది
ఎంతమందికి తెలుసు ముత్యం సముద్రపు ముద్దుబిడ్డని
చంటి గాడు గవ్వలు ఆల్చిప్పల ఏరి సంచీలు
నింపుతాడు సాగరతీరంలో.
అమ్మ గవ్వల దండలు గుమ్మానికి వేస్తుంది పండక్కి.
మామిడికాయలు అన్ని ఆల్చిప్పలకే లొంగు
సాగరతీర విహారం ప్రయోజనాలు మెండు
నదులన్నీ సాగరంలో మమేకం.
అమావాస్యకి పున్నానికి సాగరం ఆటు పోటుల పరం.
అయినా అదరదు బెదరదు సాగరం.
సముద్రపు స్నానం పుణ్యం పురుషార్థం.
సాగరతీర విహారం జనానికి మానసిక ఉల్లాసం.
ప్రస్తుతం మన జనాలకి అదే కావాల్సిన ఇంధనం.
సముద్రపు నీళ్లు ఉప్పు అయితేనేం.
సాగరమే పదిమందికి ఉపకారము చేయు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి