పెళ్లి
ఒకరి కోసం ఒకరు
ఒకరి తలపుల్లో ఒకరు.
ఒక మంత్రం పెనవేసిన బంధం.
ధర్మబద్ధంగా చేసే కాపురం దాంపత్యం.
దాంపత్యానికి పునాది పాణిగ్రహణం.
కన్యను చేపట్టడం పాణిగ్రహణం.
పరమాత్ముడే వరుడు
పరమాత్మిక వధువు
జరిగేది జగత్ kalyanyam.
మామిడిఆకుల తోరణo పందిరికీ అందం
వాయు శుద్ధి సైన్స్ చెప్పిన అంతరార్థం.
ఫోటోగ్రాఫర్ ఫోకస్ లో గోరింటాకు ప్రథమం
సౌభాగ్య ప్రదమే గోరింటాకు అలంకరణం .
నరదృష్టి కి నల్ల రాయి పగులు.
పర దృష్టి మరల్చడం భాషికముతో అలంకారం.
బుగ్గన చుక్కతో మా చుక్కకి మరింత అందం.
అగరు చుక్కతో దిష్టి ఆమడ దూరం.
అంకురార్పణ వివాహ ఘట్టం లో తొలిమెట్టు.
కళ్యాణానికి ఇది శుభమస్తు శ్రీకారం.
నవధాన్యాపు మొలకలా పచ్చగా ఉండాలని పరమార్థం.
వర శుద్ది కోసం చేసేది స్నాతకం.
ప్రాయశ్చిత్తమే పరమార్థం.
గోత్ర ప్రవరలు వల్లించడమే అంతరార్థం.
వరుడి కాశీ ప్రయాణం
బావమరిది వాగ్దానం
ఆహ్వానితులకు కుఆనందం.
తియ్యటి పానకం తో పరిచయాలు ,
పలకరింపులు ఎదురుసన్నాహం.
ఆడబిడ్డ అంటే అర్ధ మొగుడు.
ఆడబిడ్డలకు ఆత్మీయ సత్కారం
పానకం బిందెలతో బిడ్డ పరమానందం.
సంప్రదాయము ఇంత సుందరం.
మంగళములు కలుగజేయునది మాంగల్యం.
మాంగల్య మునకు అధిపతి గౌరీ దేవి.
వధువు చేసేది గౌరీ పూజ.
బురద లో పుట్టింది కమలం.
కమలమే అయ్యింది ఆసనం లక్ష్మీకి.
అడవిలో పుట్టింది వెదురు.
తన బుట్టతో మోస్తోంది ఈ లక్ష్మిని తరతరాలుగా.
ఏమి చేసుకుంది వెదురు బుట్ట అదృష్టం.
అందుకే అది పెళ్లి లో అతి ముఖ్యం.
అక్కకు పుట్టింది ఆడపిల్ల
ఆ పిల్ల మీద ఆశ లేదు అంటాడు మేనమామ.
అందుకే పిల్లను మోస్తాడు కళ్యాణమండపం దాకా.
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు
ఆ సుముహూర్తం కట్టిపడేస్తుంది తరతరాలు.
జీలకర్ర బెల్లంతోటే పుడుతుంది ఆ విద్యుత్ శక్తి.
మరింతగా దోహదం చేస్తుంది మంత్రశక్తి.
కన్యాదానం కడు రమణీయం.
వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏమి.
గుమ్మడి పండు అమ్మడి తో పాటు దానం.
పదికాలాలపాటు పచ్చదనం ఫల దానం.
బరువెక్కిన గుండెలతో బాధ్యతను బదలాయింపు.
వెరసి కన్యాదానం. వంశాభివృద్ధికి మూలాధారం.
పాపపరిహారం కన్యాదాన ఫలం.
కన్యను స్వీకరించడమే కన్యాదానం.
వరుడే శ్రీమహావిష్ణువు.
వరపూజ విష్ణు పూజ
వయస్సుల ప్రసక్తి ఏముంది మహేశ్వర.
ఆరోగ్యం కోసం ఇచ్చేదే మధుపర్కం
మధుపర్కం అంటే తేనె పెరుగు నెయ్యి మిశ్రమం.
మంగళము కలిగించేది మంగళసూత్రం.
వివాహిత స్త్రీకి అదే చిహ్నం,
శోభాయమానం.
వరుడు జీవన సంగ్రామంలో విజయం
మంగళసూత్ర మహత్యం..
పెళ్లంటే ఒక ఆచారం .
ఆచారం వెనుక సహేతుక కారణం.
తల యందు పోయే బడే బియ్యం పాలు
తలంబ్రాలు.
వధువే ధాన్యలక్ష్మి .
ధాన్యలక్ష్మి ఆరాధన తలంబ్రాలు.
ఆరాధింపబడే ది ముందుగా వధువు.
ఆ పూసతోనే మన వాడి సుడి మారుతుంది.
అమ్మాయికి దిష్టి పోతుంది.
అదే నల్లటి పూస నల్లపూస.
మూడుముళ్ల తో కలిసిన బంధం.
విధాతే వేశాడు విరిబోణి తోటి బ్రహ్మముడి.
ప్రతి అడుగుకి ఒక ప్రతిజ్ఞ.
ఏడడుగులు నడవడం మే సప్తపది.
అగ్ని దేవుడే సాక్ష్యం.
సన్నికల్లు తో పచ్చళ్ళు చేయొచ్చు.
శత్రువుల్ని పచ్చడిగా చేయొచ్చు.
భార్యను వ్యతిరేకించే వారికి బండ రాయి లాగా
వరుడు మారాలని వధువు కోరిక.
కష్టసుఖాల మయం జీవితం.
కష్టంలో బండరాయి లా ఉండటమే అంతరార్థం.
బావ మరదులు బావగారి బతుకు కోరతారు.
అందుకే బామ్మర్ది చేస్తాడు నవదంపతులతో
లాజ హోమం.
పేలాలతో అగ్ని దేవుడికి హోమం.
పంతులుగారు చూపించింది అరుంధతి నక్షత్రం.
అరుంధతి దేవిలాగ పతివ్రతలా ఉండాలని అంతరార్థం.
వశిష్ఠులవారు పక్కనే ఉన్నా ఆమాట చెప్పలేదు మన వేదం.
ఆడదానితో ఉంది సంసారరథ అందం.
సుద్దులు బుద్ధులు సుదతికి నేర్పి అప్పగించేది .
అప్పగింత.
పాలు నీళ్ళలా కలిసిపోవాలని పరమాత్ముని అంతరార్థం.
పెళ్లంటే వధూవరులకి కాదు
తరతరాలకు ఆనందం
అయిన వారికి సంతోషం.
ప్రతి సందర్భం అయినవారికి సత్కారం.
అంకురార్పణ లో పితృదేవతలు సంతృప్తి.
పంచభక్ష పరమాన్నాలు అక్కర్లేదు.
వారిని తలుచుకోవడమే వారికి తృప్తి.
వరడు కాశీ యాత్రలో బావమరిదికి సత్కారం.
ఎంత బాగుంది ఈ ఆచారం.
లాజ హోమం లో కూడా ఉంది బామ్మర్ది సత్కారం.
ఎదురు సన్నాహంలోఎరగని వారికి కూడ సత్కారం.
వారు ఇస్తారు నవ వధూవరులకు ఆశీర్వచనం.
పెళ్లి మాటల్లోనే ముందుగా అడుగుతారు
పానకం బిందెలవ్యవహారం
తెలుసుకుంటారు ఆడపిల్ల అభిప్రాయం.
ఇదే ఆడపిల్లకు చేసే సత్కారం .
మనసెరిగి ముందుకు అడిగేస్తే అది సంబరమే.
బుట్ట మోసిన మేనమామ కి బొట్టు పెట్టి ఇచ్చే సత్కారం.
పెళ్లి ఏ రక్త సంబంధాన్ని వదలలేదు.
అత్త గారిని వదల్లేదు మన ఆచారం.
అత్తగారిని అందంగా అలంకరించిడం వియ్యాల వారి కి
ఆనందం.
షడ్రుచులతో పెళ్లి విందు
సాదరంగా ఆహ్వానించడమే అందం.
ఆహ్వానితులు మెచ్చుతారు మీ అభిమానం.
ఇదొక్కటే ముఖ్యం ఆడ ,మగ పెళ్లి వారికి.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
సామర్లకోట.
9491792279
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి