జీవిత భద్రత
జీవితభద్రత. కన్ను మూస్తే మరణం కన్ను తెరిస్తే జననం అని చావు పుట్టుకల గురించి ఒక కవి నిర్వచనం ఇచ్చాడు. జీవితం చాలా అనిశ్చితమైనది. ఎప్పుడు ఏది ముంచుకొస్తుందో మనకు తెలియదు. రోజు మనంచూస్తున్న మనుషులు సడన్ గా మాయం అయిపోతూ ఉంటారు.కారణాలు అనేకం హార్ట్ ఎటాక్ కావచ్చు మరి ఇతర అనారోగ్యం యాక్సిడెంట్ కావచ్చు కరోనా లాంటి వ్యాధులు కావచ్చు. ఈరోజుల్లో నడి వయసు ఉన్న వ్యక్తులకు నూటికి 90 మందికి ఆర్థిక భారాలు ఎక్కువగా ఉంటున్నాయి. రుణాలు ఇచ్చే బ్యాంకులు విపరీతంగా పెరిగాయి. అలాగే రుణం తీసుకుని వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. అన్ని సౌకర్యాల కోసంబ్యాంకుల దగ్గర అప్పు చేసి వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్నారు. అయితే అనుకోకుండా వచ్చిన ఆ వ్యక్తి మరణం వల్ల ఆ భారం అంతా భార్య మీద పిల్లల మీద పడుతుంది. ఇటువంటి సమయంలో ఆర్థిక భారాలన్నిటిని కుటుంబానికి భారం కాకుండా కాపాడేది టర్మ్ ఇన్సూరెన్స్. అయితే ఇంటి రుణాలు ఇచ్చే ప్రతి జాతీయ బ్యాంకు గాని ఫైనాన్స్ సంస్థలు గాని ఇంటి రుణం భద్రత కోసం భీమా కవరేజ్ తీసుకోవడం తప్పనిసరి చేశాయి. ఇది ఆ ఇంటి రుణం వరకే వస్తుంది. మిగిలిన దేనికి వర్తించదు. దీనితోపాటు ప్రతి వ్యక్తి టర్మ్ ఇ...