జీవిత భద్రత

జీవితభద్రత.

కన్ను మూస్తే మరణం కన్ను తెరిస్తే జననం అని చావు పుట్టుకల గురించి ఒక కవి నిర్వచనం ఇచ్చాడు. జీవితం చాలా అనిశ్చితమైనది. ఎప్పుడు ఏది ముంచుకొస్తుందో మనకు తెలియదు. రోజు మనంచూస్తున్న మనుషులు సడన్ గా మాయం అయిపోతూ ఉంటారు.కారణాలు అనేకం హార్ట్ ఎటాక్ కావచ్చు మరి ఇతర అనారోగ్యం యాక్సిడెంట్ కావచ్చు కరోనా లాంటి వ్యాధులు కావచ్చు.

ఈరోజుల్లో నడి వయసు ఉన్న వ్యక్తులకు నూటికి 90 మందికి ఆర్థిక భారాలు ఎక్కువగా ఉంటున్నాయి. రుణాలు ఇచ్చే బ్యాంకులు విపరీతంగా పెరిగాయి. అలాగే రుణం తీసుకుని వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. అన్ని సౌకర్యాల కోసంబ్యాంకుల దగ్గర అప్పు చేసి వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్నారు.
అయితే అనుకోకుండా వచ్చిన ఆ వ్యక్తి మరణం వల్ల ఆ భారం అంతా భార్య మీద పిల్లల మీద పడుతుంది. ఇటువంటి సమయంలో ఆర్థిక భారాలన్నిటిని కుటుంబానికి భారం కాకుండా కాపాడేది టర్మ్ ఇన్సూరెన్స్.

అయితే ఇంటి రుణాలు ఇచ్చే ప్రతి జాతీయ బ్యాంకు గాని ఫైనాన్స్ సంస్థలు గాని ఇంటి రుణం భద్రత కోసం భీమా కవరేజ్ తీసుకోవడం తప్పనిసరి చేశాయి. ఇది ఆ ఇంటి రుణం వరకే వస్తుంది. మిగిలిన దేనికి వర్తించదు. దీనితోపాటు ప్రతి వ్యక్తి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఈ రోజుల్లో చాలా మంచిది.

ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ని అన్ని జీవిత బీమా కంపెనీలు అందజేస్తున్నాయి. ఈ పాలసీ తీసుకునే వ్యక్తి వయసును బట్టి పాలసీ కాల పరిమితిని బట్టి ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.

ప్రీమియం ప్రతినెలా లేదా మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి చెల్లించేవీలు ఉంటుంది. అయితే అన్నిటికన్నా ముఖ్య విషయం ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియపరచాలి. అంతేకాకుండా వైద్య పరీక్షలకి హాజరైనప్పుడు ఏది దాచకుండా చెప్పాలి. ఇది చాలా అవసరం. అయితే పాలసీ తీసుకునేటప్పుడు క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఒకసారి దృష్టిలో పెట్టుకోవడం కూడా చాలా మంచిది.

కొన్ని జీవిత బీమా కంపెనీలు సింగిల్ ప్రీమియం పాలసీలు కూడా అందజేస్తున్నాయి. అయితే వీటికి మిగతా వాటికన్నా కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ప్రీమియం సకాలంలో చెల్లించడం మర్చిపోయేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒక్కసారి పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. 

అలాగే మనకి వయస్సు పెరిగే కొలది బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇది దృష్టిలో పెట్టుకుని మన ఆర్థిక స్తోమతను బట్టి భీమా కవరేజీ కూడా మార్చుకోవచ్చు. కొన్ని కంపెనీలు దేశంలోని ద్రవ్యోల్బణ పరిస్థితులను బట్టి అవే భీమా కవరేజిని పెంచుతుంటాయి.అయితే వాటి పరిస్థితి ఎలా ఉన్నా మన అవసరాన్ని బట్టి మనం భీమా కవరేజ్ ను పెంచుకునే వీలుంది.

మనలో చాలామంది కొంతకాలం ప్రీమియం చెల్లించిన తర్వాత ఇది కొనసాగించడానికి ఇష్టపడరు. రకరకాల కారణాలు అయ్యుండొచ్చు. అటువంటి సందర్భంలో అంతవరకు కట్టిన సొమ్ముని తిరిగి తీసుకునే వీలుంది. అయితే కొన్ని కంపెనీలు పరిమిత కాలం ప్రీమియం చెల్లించిన తర్వాత ఆ వ్యక్తికి జీవితాంతం భీమా వర్తింపచేస్తాయి. ఆ పాలసీదారుడు క్లైమ్ అమౌంట్ ని నెల నెల నామినీకి చెల్లించమని ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు.

ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ బీమా కంపెనీ వారి పరిమితులకు లోబడి వారు తీసుకున్న పాలసీ అమౌంట్ ని బట్టి నామినీకి అందజేస్తారు.

అయితే పాలసీదారుడు మరణించిన వెంటనే సంబంధిత జీవిత బీమా కంపెనీకి వెంటనే తెలియపరచడం తదుపరి వారు చెప్పిన పత్రములు సమర్పించడం కుటుంబ సభ్యుల బాధ్యత. 
సాధారణంగా నాకు తెలిసినంతవరకు30 రోజులు వరకుటైం ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి తన ఆరోగ్య సంబంధిత రికార్డుని భద్రంగా దాచుకోవడం చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో అది చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్యం గురించి ఏమాత్రం దాచిన క్లైమ్ సెటిల్మెంట్ జరగదు. అందుకునే ఎవరి బలవంతవల్లో కాకుండా తనకు తానుగా విషయాలన్నీ చదువుకుని అర్థం చేసుకుని అప్పుడు మాత్రమే పాలసీ తీసుకోవడం చాలా మంచిది. పాలసీ వచ్చిన తర్వాత నామిని పేరు ,పాలసీదారుడు పేరు, అడ్రస్సు, డేట్ అఫ్ బర్త్, కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. సoభoధిత ఆధార పత్రములుతో సరిచూసుకోవాలి. సాధారణంగా పాలసీ తీసుకున్న వెంటనే ఆ కాగితం బీరువాలో పెట్టేస్తాం. కరెక్ట్ గా ఉందో లేదో చూసుకో ము. క్లైమ్ సెటిల్మెంట్ చేసేటప్పుడు భీమా కంపెనీ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. 

సాంకేతికత బాగా పెరిగిన ఈ రోజుల్లో మనం ప్రతిదానికి గూగుల్ తల్లి మీద ఆధారపడుతున్నాం. అయితే పాలసీ బజార్ అనే యాప్ ఈ పాలసీ గురించి సమగ్ర సమాచారం అందజేస్తుంది.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట