పోస్ట్‌లు

మే 5, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

నోటు

నోటు రంగురంగుల కాగితం. దాని మీద అంకె చూస్తేనే మనకి ధైర్యం. ఏ అంకె లేకపోతే అది తెల్ల కాగితం. ఆ అంకె తో టే దానికి వచ్చింది పెద్ద గొప్ప. దాని పేరే కరెన్సీ నోటు అది ఉంటే నే మన జేబు కళకళలాడు. జేబులో నోటుఉంటే గరీబ్ కూడా షరాబే. అప్పు తీసుకుంటే ప్రామిసరీ నోట్ రాస్తారు అప్పు తీర్చడం కరెన్సీ నోటు తో చేస్తా రు. కరెన్సీ నోటు తోటే మనిషికి ఎక్కడలేని ధైర్యం. సంఘం ఇస్తుంది అపారమైన గౌరవం. మనిషి మమతలకు విలువ శూన్యం గాలికి ఎగిరిపోయే నోటు విలువ అపారం. మనిషి విలువకి కరెన్సీ కొలమానం. మనిషికి మనిషిగా విలువ శూ న్యo నోటు చుట్టూ చక్కర్లు కొడుతోంది మానవ ప్రపంచం. నోటు చూపించి కొండ మీద కోతిని దింపచ్చు. నోటుతో టే ఉంది రాజకీయ భవితవ్యం. పని జరగాలంటే నోటు ఫైలు కదలాలంటే నోటు. సూది పొడవాలి అంటే నోటు. ఓటు పడాలంటే నోటు. పదవి కావాలంటే నోటు పదవి నిలపాలంటే నోటు పండగ జరపాలంటే నోటు బడిలో సీటు కావాలంటే నోటు. ఒడిలో చోటు కావాలంటే నోటు. పంచ ప్రాణాలులో ఒక ప్రాణం నోటు. నోటు నువ్వు లేకపోతే మాకు ఈ ప్రపంచంలోనే లేదు చోటు. నిత్యం దానికోసమే మానవుడు పడుతున్నాడు అంతర్మథనం. అంతర్మధనం తోటి పెరుగుతోంది మనిషి రక్త పోటు. రచన మధునాపంతుల చిట...

బీరువా

బీరువా గదిలో మూలనున్న గది కే అందం. విలువైన వస్తువులన్నీ నా వడిలో భద్రం. నాన్న నెల జీతం  అమ్మ ఆభరణం పెళ్లినాటి పట్టు చీరలు. వెండి సామాన్లు పిల్లల ప్రశంసాపత్రాలు నా ఒడిలో భద్రపరిస్తే యజమానికి ఆనందం. కమ్మగా నిద్రిస్తారు కలతలు లేకుండా. కొత్త కాపురానికి పంపించేటప్పుడు అమ్మాయితో పాటు అత్తారింటికి. అందంగా ఆ గదిలో చేరుతాను. మౌనంగా ముద్దు ముచ్చట కళ్లుమూసుకుని వింటాను ఎందుకంటే రాత్రికి నా కళ్ళ కి గంతలు  అమ్మాయికి కడుపు పండి చంటి బిడ్డ ఒడిలో చేరినా ఏడుస్తున్న చంటి దాన్ని సముదాయించి లేను. చంటి దాని చేతిలో పెట్టిన విలువైన వస్తువులు భద్రంగా దాచుతాను. సంసారంలోని కలతలతో అమ్మాయి తలగడ లో తలదాచుకుని ఏడుస్తున్నా చేరదీసి సముదాయించలేను నేను ప్రాణం లేని శిలను. వయసు మీరినా వరదలా ప్రవహిస్తున్న  వారి ప్రేమను చూసి సిగ్గుతో తలదించుకుంటాను. ఎందుకంటే ఆ గది తప్ప వేరే గదిలో నాకు స్థానం లేదు. పరువాలు పంచడానికి ఆ గదే సంపదలు ఉంచేది ఆ గదే నామీద కుటుంబానికి ఒక నమ్మకం తెచ్చిన సంపాదన మూడింతలు అవుతుంది అని ఆ పేరే తెచ్చింది మా వంశీకులకు గౌరవం. అందుకే ప్రతి ఇంటిలో మాకు స్థానం. పాలబుగ్గల పసిపిల్లల దొంగ పోల...

జీవ నది

నేను ఒక జీవనదిని. నేను మీకు తెలియని దాన్ని కాదు. మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం వద్ద పుట్టాను. జలజల పరిగెడుతూ నిజాంబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం జిల్లాలోని ప్రజలను పంటపొలాలను పలకరించి తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది వద్ద నా తల్లి ఒడిలో చేరుతున్నా ను. నేను ధవళేశ్వరం వద్ద ఏడు పాయలుగా చీలి సప్త ఋషుల పేర్లు పెట్టుకున్నాను. నాకు చాలా పౌరాణిక చరిత్ర ఉంది.                                                                                          పూర్వకాలంలో గౌతమ మహర్షి గోహత్య పాతక నివృత్తి కోసం శివుని మెప్పించి గంగను భూమి మీదకు తీసుకు వస్తారు. ఆ గంగయే గోదావరి నది. గౌతమీ నది అని కూడా పిలుస్తారు. మీ ఇంటిలో జరిగే ప్రతి శుభ అశుభ కార్యక్రమాలు నేను లేకుండా ఏదీ జరగదు. పచ్చగా ఉండే మీ పంట పొలాలను నిత్యం నేను పలకరిస్తూనే ఉంటాను.. జలజలా పారుతూ అంతర్వేదిలో కలిసిపోతున్న...

అల్పాహారం

. అల్పాహారం అల్పాహారమున ఇడ్లీకి తోడు నిలిచి  బ్రే వు మని త్రేనుపు తెచ్చును పితృదేవతలను తృప్తిపరచి పుణ్యము నిచ్చును. మధ్యలో సున్నా ఉంటే నేమి మందిచేత  మార్కులు కొట్టేసిన మినప గారికి వందనం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.           కాకినాడ 9491792279

సోడా

సోడా  గరళాన్ని గొంతులో దాచి గరళకంఠుడయ్యాడు శివుడు. రంగురంగుల గోళాన్ని గొంతుకి అడ్డుగా పెట్టుకుని గోలి సోడా నయ్యాను. శివుడు గరళాన్ని వదిలేస్తే జగమంతటికి ప్రమాదం. నా గొంతుకు అడ్డం పడిన గోళీ నా ప్రాణం. నా ఉనికికి అదే ఆధారం. మాది విడదీయలేని బంధం. ఒకప్పుడు సర్వకాల సర్వావస్థల యందు మీకు ప్రాణ స్నేహితుడునీ. విందులో ,మందులో తప్పకుండా హాజరయ్యే అతిధిని. పీకలు దాకా తిన్నవాడికి కడుపు బరువుని డొక్కమాడుతున్న వాడికి దాహం తీర్చే చౌక రకం పానీయాన్ని. ఎంతోమందికి ఉపాధినిచ్చేదాన్ని. సోడా కొట్టులు షోకు మార్చుకుని షోకేసుల్లో మెరిసిపోయే సీసాలు పెట్టుకుని నా పొట్ట కొట్టేసారు. పట్టణాలలో పల్లెల్లో నాలుగు మూలలా దొరికే బంగారాన్ని. ఇప్పుడు కాదు. ఇది ఒకప్పటి మాట. రంగునీళ్ళ సీసాలు వచ్చి  మ్యూజియంలో బొమ్మనైపోయా. కనుమరుగైపోయా. కార్పొరేట్ కల్చర్ వచ్చి కలర్ నీళ్లు తీసుకువచ్చి నా కడుపు కొట్టేసింది. మొదట్లో మామూలు సోడాని. కాలం మారి చలువరాతి గదుల్లో దూరి కూలింగ్ సోడా అయిపోయా. చలవ చేసే నిమ్మ జాతి పండ్లతో చేరి నిమ్మ సోడా అయిపోయా. ఆ తరం అల్లరి మూక చేతిలో ఆయుధం అయిపోయా.  చివరికి ఈ తరం వాళ్లకి అపురూపమైన వస్తువ...

పిచిక గూడు

పిచిక గూడు ఈ లోకంలో మనిషి తన గూడు తానే సొంతంగా నిర్మించుకోలేడు.మాట తెలిసిన మానవుడు కూడా అన్నీ ఉండి నిపుణులైన వారి మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ ఒక్క పక్షి జాతి మాత్రం తన గూడు తానే నిర్మించుకుంటుంది. గూడు ఈ విధంగా ఉండాలని, నిర్మించాలని ఎవరు నేర్పారు ఈ మాటలు రాని పక్షికి. ఒక్క భగవంతుడు తప్పితే ఇంకెవరు చెప్తారు.  ఒక మనిషి ఇల్లు కట్టాలంటే ప్రభుత్వం వారి అనుమతితో పాటు, శాస్త్ర సమ్మతము కూడా అయి ఉండాలి. ప్రతి మనిషికి కొన్ని కలలు ఉంటాయి. ఆ కలల ప్రకారం తన స్వర్గం నిర్మించుకోవాలని తాపత్రయ పడిపోతుంటాడు. మనిషికి ఆశకి అంతులేకుండా పోయింది. మూడు గదులలో సంసారం చేసే కుటుంబాలు రెండు పడకగదులతో ఇల్లు ఉండాలని అది కాకుండా ఎవరు పడకగది వాళ్ళకు ఉండాలని అది కాకుండా ఆధునిక కాలంలో జనం మెచ్చే విధంగా డూప్లెక్స్ కట్టుకోవాలని ఇలా రోజురోజుకీ మనిషి కోరికల సముద్రంలో కొట్టుకుపోతూ ఉన్నాడు. చివరికి మిగిలేది ఇద్దరే ఆ ఇంట్లో. చివరికి తన స్వర్గాన్ని శుభ్రం చేసుకునే ఓపిక కూడా ఆ మనిషికి ఉండదు.  ఆ పక్షికేముంది చెట్టు కొమ్మ ఉంటే చాలు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా గూడు నిర్మించేసుకుంటుంది. ఆ పక్షి జాతి తరతరాలుగా ఒకే ...

దేవుడు

దేవుడు కాసులు ఉన్నవాడికి  లేనివాడికి ఆ దేవుడే దిక్కు  ముక్తి కోసం వచ్చే భక్తులకి  గుడి లోపల దేవుడు వరాలు ఇస్తాడు.  భుక్తి కోసం పడిగాపులు కాచే అన్నార్తులకి  భక్తుల చేత వరహాలిప్పిస్తాడు దేవుడు గుడి ముందు కూర్చున్న బిచ్చగాడు  గుడిలోకి అడుగుపెట్టడు  ఎందుకని  గుడిలో నుంచి తన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ  దేవుడికి ప్రతిరూపాలని నమ్ముతాడు కాబట్టి. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279

మామిడి తోట

మామిడి తోట వేసవికాలం సాయంకాలం నాలుగు గంటలు అయింది. అయినా ఇంకా ఎండ ప్రతాపం తగ్గలేదు. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతంఅయింది. ఈదురు గాలులు." గాలి దుమ్ము వచ్చేలా ఉంది పిల్లలు అందరూ తోటలోకి వెళ్దాం పదండి తట్టలు పట్టుకుని రండి ఉన్న కాయలు రాలిపోతాయి కాబోలు అనిచలపతిరావు గారు తోటలోకి పరిగెత్తారు పిల్లలతో సహా. బలంగా వీస్తున్న గాలులకి కొమ్మలు అటు ఇటు ఊగుతూ ఉన్నాయి.అప్పటికే తోటలో కాయలు కొద్దికొద్దిగా గాలికి కింద పడిపోయిఉన్నాయి.  పిల్లలందరూ మామిడికాయలు ఏరి ఆ తట్టలో పడేసారు. అలా తట్టతో తీసుకొచ్చిన కాయలు ముక్కలుగా మారి కుండలో మరునాడు మాగాయిగా మారిపోయేది .అది చిన్ననాటి మామిడి తోట అనుభవం. ఆ మామిడి తోటకు సుమారు అప్పటికి 60 సంవత్సరాల సంవత్సరాల వయసు ఉంటుంది. ఎప్పుడో మా తాతగారు అన్నదమ్ములు అందరూ కలిసి నాటిన మొక్కలు. వాళ్లు బ్రతికున్న రోజుల్లో వాటి ఫలాలు తిన్నారా లేదో తెలియదు గాని అంటే మనవలం శుభ్రంగా ఆనందంగా ఆ మామిడి తోట లో కాసిన మధుర ఫలాలు అన్ని శుభ్రంగా తిన్న వాళ్ళమే. ఆ తోట చూసినప్పుడల్లా నాకు రాజుగారు ముసలివాడు కథ గుర్తుకొస్తుంది. ఆ తరం వాళ్లకి ఎంత ముందుచూపు. అంత పెద్ద తోటను పెంచడానికి వాళ్ళు ఎంత కృ...