కాలపరిమితి
కాల పరిమితి
గతకాలం మిగిల్చిన చేదు అనుభవం
తలచుకుంటే లాభమెంత?
గడచిన ప్రతి క్షణం
కాలపు చెక్కుచెదరని శాసనం
వదులుకుంటూ సాగడమే జీవితం
వర్తమానాన్ని ఆనందంగా గడపడమే
మనిషిగా మన కర్తవ్యం
ఏ బంధం ఎప్పుడెప్పుడో
ఉరిమే మేఘంలా గర్జిస్తుందో
లేదా పల్లకిలో మోస్తుందో
ఎవ్వరికీ తెలియదు
కాలచక్రం నిలవదు
నిను నిన్నలో విడిచిపెట్టి పోతుంది
నీవు తిరిగి వెతికినా
ఆ గడియలు తిరిగి రావు
బంధాలను నమ్మినా
కాలం నీవు చూసిన ముఖాల్ని
మరుగున పడేస్తుంది
కానీ ఆ హృదయంలో
వారి నవ్వులు ఇంకా గడియలు మోగిస్తుంటాయి
గుర్తులు మిగులుతాయి
పలకరింపులు పోతాయి
కానీ మనసు మాత్రం
పాత జ్ఞాపకాలలో
తేలిపోతూనే ఉంటుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి