ఇదీ వ్యసనమే
ఇదీ వ్యసనమే ప్రపంచంలో సమాజ సేవకి అనేక సంస్థలు ఉన్నాయి. సమాజానికి ఉచితంగా చేసే సేవ ని సోషల్ సర్వీస్ అంటారు.అలాగే సమాజానికి ఉచితంగా సమాచారాన్ని అందించే ఒక వేదికని సోషల్ మీడియా అంటారు. ప్రపంచంలో అత్యధిక ప్రజాభిమానాన్ని చూరగొన్న సోషల్ మీడియా ఫేస్బుక్. తెలుగులో ముఖ పుస్తకం అంటారు. ఈ పేస్ బుక్ లో మనకు ఓ పేజీ ఉంటుంది. మనతోపాటు మన బంధువులు స్నేహితులు ముక్కు మొఖం తెలియని దుబాయ్ శీను లు మనకు స్నేహితులైపోతారు. ఏదైనా మంచి చెడు పక్క వాళ్లకు షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఫేస్బుక్లో పెట్టకుండా ఉండలేము. కొంతమంది చూసి స్పందిస్తారు. మరి కొంతమంది వదిలేస్తారు. వాళ్లు కొట్టే లైకులకి మన హృదయం లయ తప్పుతుంది. ఇదో మానసిక ఆనందం. తప్పేముంది. మన పుట్టినరోజు అడ్రస్సు పాస్పోర్ట్ సైజు ఫోటో తన కౌగిలిలో బంధించుకుని ప్రపంచానికి మన జాతకం చూపిస్తోంది. ఒకప్పుడు మత్తు పదార్థాలకు మందుకి యువత బానిస అయ్యేవారు. ఇప్పుడు కొత్తగా ఫేస్బుక్ ఆ లిస్టులో చేరింది. పూర్వకాలంలో వార్తల కోసం రేడియోలు వార్తాపత్రికలు మీద ఆధారపడే వారు కాలం మారింది . సాంకేతికంగా ప్రపంచం అభివృద్ధి చెందింది. ఏదైనా సంఘటన జరిగిన క్షణకాలంలో ఫోటోలు తో ...