ఇదీ వ్యసనమే

ఇదీ వ్యసనమే 

ప్రపంచంలో సమాజ సేవకి అనేక సంస్థలు ఉన్నాయి. సమాజానికి ఉచితంగా చేసే సేవ ని సోషల్ సర్వీస్ అంటారు.అలాగే సమాజానికి ఉచితంగా సమాచారాన్ని అందించే ఒక వేదికని సోషల్ మీడియా అంటారు.

ప్రపంచంలో అత్యధిక ప్రజాభిమానాన్ని చూరగొన్న
సోషల్ మీడియా ఫేస్బుక్. తెలుగులో ముఖ పుస్తకం అంటారు.

ఈ పేస్ బుక్ లో మనకు ఓ పేజీ ఉంటుంది. మనతోపాటు మన బంధువులు స్నేహితులు ముక్కు మొఖం తెలియని దుబాయ్ శీను లు మనకు స్నేహితులైపోతారు. ఏదైనా మంచి చెడు పక్క వాళ్లకు షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఫేస్బుక్లో పెట్టకుండా ఉండలేము. కొంతమంది చూసి స్పందిస్తారు. మరి కొంతమంది వదిలేస్తారు. వాళ్లు కొట్టే లైకులకి మన హృదయం లయ తప్పుతుంది. ఇదో మానసిక ఆనందం. తప్పేముంది.

మన పుట్టినరోజు అడ్రస్సు పాస్పోర్ట్ సైజు ఫోటో తన కౌగిలిలో బంధించుకుని ప్రపంచానికి మన జాతకం చూపిస్తోంది.

ఒకప్పుడు మత్తు పదార్థాలకు మందుకి యువత బానిస అయ్యేవారు. ఇప్పుడు కొత్తగా ఫేస్బుక్ ఆ లిస్టులో చేరింది.

పూర్వకాలంలో వార్తల కోసం రేడియోలు వార్తాపత్రికలు మీద  ఆధారపడే వారు

కాలం మారింది . సాంకేతికంగా ప్రపంచం అభివృద్ధి చెందింది. ఏదైనా సంఘటన జరిగిన క్షణకాలంలో ఫోటోలు తో సహా ముఖచిత్రంలో కనిపిస్తాయి.

నేను తెలుగు భాష అభిమానిని కాబట్టి ముఖ పుస్తకం అని రాస్తాను. మీరు ఆంగ్లంలోకి తర్జుమా చేసుకోండి.

అమెరికాలో పుట్టిన ఈ బంగారం ప్రపంచం నలుమూలల వ్యాపించి అందరి మనసులను దోచేసుకుంది.

తెల్లవారుతుండగానే మంచం మీద నుంచి లేవకుండానే ముఖచిత్రం చూసి మురిసిపోతున్నారు. ఆహారం తినే సమయంలో కూడా ముఖచిత్రాన్ని వదలడం లేదు.
స్నానాలు గది మాట నాకు తెలియదు.

యువతీ యువకులు వృద్ధులు ఒకరేమిటి వయోభేదం లేకుండా అందరూ దీనికి బానిసలే. అందర్నీ తన వేపు నుండి దృష్టి మరుల్చకుండా చేస్తోంది.

చేతి గడియారంలో డేటు మారేది దాకా ముఖ చిత్రంలో మునిగిపోతున్నారు.

ముఖ్యంగా యువత మనలో లేరు. ఆ లోకంలో విహరించి మా లోకంలా తయారవుతున్నారు

ఉచితంగా లభించే సర్వీసు ఊరికినే వదులుతారా మనవాళ్లు. సరదాలన్నీ తీర్చుకుంటున్నారు.

విహారయాత్రల ఫోటోలు విందులో మందులో పాల్గొన్న ఫోటోలు
పెళ్లి ఫోటోలు చావు ఫోటోలు ఒకటేమిటి మన సంసారం అంతా ఫేస్బుక్ లోనే .
విష్ణుమూర్తికి సహస్రనామాలు ఉన్నట్లుగా ఫేస్బుక్లో రకరకాల గ్రూపులు.కులాల వారీగా సంస్థల వారీగా రాజకీయ పార్టీల వారీగాతినే తిండి దగ్గర్నుంచి చదువుకునే యూనివర్సిటీల వారిగా అందరినీ కలుపుతోంది ఈ ముఖచిత్రం.

అందమైన దుస్తులు ముఖచిత్రంలో చూసి ఆన్లైన్లో క్రెడిట్ కార్డు గీకితే హ్యాకర్ బాబాయిలు ఇల్లు గుల్ల చేస్తున్నారు.

సమాచారానంత దొంగిలించి మన సరదా తీర్చేస్తున్నారు.
ఎంత కట్టు దిట్టం చేసినా గట్లు తెంచి సమాచారం తమ సొంతం చేసుకుంటున్నారు హ్యాకర్ వీరులు.

అమ్మాయి ఫోటో కదా అని ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే ఎవడ్రా నువ్వని అబ్బాయి సమాధానం చెబుతున్నాడు. నేను మగాడిని రా బుజ్జి అంటున్నాడు.
చిన్నప్పుడు స్కూల్లో కాలేజీలో చదువుకునే తోటి విద్యార్థులను
స్నేహితులు అంటారు. ఇప్పుడు కొత్తగా ఫేస్బుక్ ఫ్రెండ్ వచ్చింది.lట్రెండు మారింది. అంచులు దాటన్నంతవరకు ఈ స్నేహం మంచిదే.మధ్యలో ఫేస్బుక్ హ్యాకర్లు దూరి మన విషయాలన్నీ దొంగలించి సొమ్ములు డిమాండ్ చేస్తున్నారు.

ఇక పెళ్లి సంబంధాల గ్రూపులు గురించి చెప్పక్కర్లేదు. అన్ని సోషల్ మీడియా లోనే. గుప్తంగా ఉంచవలసిన వయస్సు ఆదాయం పబ్లిక్ గా తెలిపితే కానీ పిల్లలకి పెళ్లి సంబంధం కుదరడం లేదు. ఏదైనా సంబంధం వస్తే యువతీ యువకులు ఆ పిల్ల గురించి ఫేస్బుక్లో వాకబు చేస్తున్నారు. 
సరదాగా సినిమా డ్రస్సులు కట్టుకుని ఫేస్బుక్లో ఫోజులిస్తే పిల్ల మీద ముద్ర పడిపోతోంది. దీనంగా ఉండే ఫోటోలు పెట్టి దానం చేయమని ప్రార్థిస్తున్నారు
నిజాన్ని కళ్ళ తోటి చూస్తే గాని నమ్మలేము.
అన్ని రంగాల్లోకి ముఖ చిత్రం దూరి వ్యాపారానికి ఆధారం అయింది

ప్రపంచంలోకి సమాచారం తొందరగా వ్యాపించాలంటే ఏకైక సాధనo ముఖ చిత్రమే. అది మంచి వార్త అయితే పర్వాలేదు. తెలిసి తెలియకుండా పెట్టే చెడు వార్త కొంపలు ముంచుతుంది.
ఎవరిదైనా చావు కబురు చల్లగా చెప్పమంటారు. ఇలా కన్నుమూసే లోపు అలా లైవ్ న్యూస్ ఫేస్బుక్ ఎక్కుతోంది. కొన్ని విషయాలు చెప్పవలసినవి కొన్ని విషయాలు చెప్పకూడనవి.

ఏమిటో గుట్టుగా సంసారం చేసుకునే రోజులు పోయాయి.
గూడు దాటి విషయాలన్నీ వీధికి ఎక్కుతున్నాయి.

ఈ సోషల్ మీడియా కంపెనీ వారికి మంచి ఆదాయాన్ని
అన్ని వర్గాల ప్రజలకు కాలక్షేపాన్ని ఇస్తోంది.

నేను ఇన్ని చెప్పాను నేను కూడా ఫేస్బుక్కి అలవాటు పడినవాడనే. 

ఈ సోషల్ మీడియా రూపశిల్పికి శత సహస్ర వందనాలు.
ఆయన మేధాశక్తికి జోహార్లు.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట