విశాఖపట్నం _ఇసుక కొండ
విశాఖపట్నం _ ఇసుక కొండ ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య పట్టణాల్లో సముద్ర తీర ప్రాంతమైన విశాఖపట్నం ఒకటి. ఇక్కడ అనేక పరిశ్రమలు , అందమైన బంగాళాఖాతం ఒడ్డున అందంగా తీర్చిదిద్దబడిన బీచ్, కనకమహాలక్ష్మి గుడి, పార్కులు, దగ్గరలో ఉన్న సింహాచలం, చూడకుండా ఈ ఊరు వెళ్ళిన వారు ఎవరు ఉండరు. విశాఖపట్నంలో చూడవలసిన మరొక ముఖ్యమైన ప్రదేశం పూర్ణ మార్కెట్ దగ్గర ఉన్న ఇసుక కొండమీద వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం. సాధారణంగా సత్యనారాయణ స్వామి అంటే అన్నవరం గుర్తుకొస్తుంది. అయితే ఇసుక కొండమీద ఈ దేవాలయం నిర్మించి 200 సంవత్సరములు అయింది. ఇక్కడ స్వామి కూడా అత్యంత మహిమాన్వితుడు. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి నాడు ఇక్కడ స్వామివారికి సత్యనారాయణ స్వామి వ్రతములు చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ కోరికలు తీర్చుకుంటారు భక్తజనులు. ఐదు పౌర్ణములు వరుసగా స్వామిని దర్శించి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామని మొక్కుకుంటారు. అందమైన విశాఖ నగరానికి ఇది ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. చూడవలసిన ప్రదేశం.