ఫాస్ట్ ఫుడ్స్
ఫాస్ట్ ఫుడ్ – రుచికి ఋజువు, ఆరోగ్యానికి ప్రమాదం! ఇవాళ చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఫాస్ట్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. బయటకు వెళ్ళిన వెంటనే బర్గర్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, నూడుల్స్ లాంటి తిండి తినాలని చాలామందికి తహతహలే. అయితే ఈ రుచికి పెట్టిన ధర మన ఆరోగ్యానికి హాని చేస్తుందని అందరికీ తెలుసు . అయినా ఇంటి భోజనం అంటే ఎవరికి ఇష్టం ఉండక, ముఖ్యంగా చేసుకుని ఓపిక లేక, భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఉండడంతో ఫాస్ట్ ఫుడ్ ల మీద ఆధారపడిపోతున్నారు. విచిత్రం ఏమిటంటే చిన్నపిల్లలకు కూడా ఈ హోటల్ కి తీసుకెళ్లడం అలవాటు చేస్తున్నారు. ఇంక పెద్దయిన తర్వాత వాళ్లకు అదే అలవాటైపోయి హోటల్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. ఒకపక్క అనారోగ్యాలు వస్తున్నాయని చెప్తున్నా ఎవరు వినిపించుకునే స్థితిలో లేరు. బజారులోనూ బేకరీలోనూ హోటల్లోనూ దొరికే ఆకర్షణీయమైన ఈ ఫాస్ట్ ఫుడ్ లు జొమాటో స్విగ్గిల ద్వారా తెప్పించుకుని తిని ఆనంద పడిపోతున్నారు. అసలు ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఏమిటి? దాని మూలాన శరీరానికి ఏ విధమైన నష్టం జరుగుతుంది అనే విషయం మళ్లీ పునఃశ్చరణ చేసుకుందాం. ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఏమిటి? ఫాస్ట్ ఫుడ్స్ అనేవి త్వరగా తయారయ్యే, తక్కువ సమయం...