పోస్ట్‌లు

అడవి తల్లి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అడవి తల్లి మనసు

అడవి తల్లి మనసు " ఒరేయ్ సుధాకర్ ఈ వీకెండ్ కి మనం మారేడుమిల్లి అడవులకు పెడదాం రా! అది మా ఊరికి చాలా దగ్గర. కార్లో వెళ్ళిపోదాం. చూడ్డానికి చాలా బాగుంటుంది రా! చుట్టూ అందమైన పచ్చటి చెట్లు లోయలు అవి చూస్తుంటే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా అక్కడ దొరికే బొంగు చికెన్ మరి ఎక్కడ దొరకదు. అంత రుచికరంగా ఉంటుంది అంటూ చెప్పుకుపోతున్న మహేష్ మాటలకి అడ్డు తగులుతూ అది అడవి అంటున్నావు మరి అడవుల్లో కారు ఎలా వెళుతుంది పైగా క్రూర జంతువులు ఉంటాయేమో! అని సందేహంగా అడిగాడు మహేష్.  "ఊరుకోరా అది అడవి ఏమిటి ? చూడడానికి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పెద్ద క్రూర మృగాలు అక్కడ ఏం కనిపించవు . అవి ఎప్పుడు ఎవరికంట పడలేదు. అడవి మధ్యలో అందమైన తారు రోడ్లు వేసి విహార స్థలాల కింద ఎప్పుడో మార్చేశారు అంటూ చెప్పుకొస్తున్న మహేష్ మాటలకి సుధాకర్ కి చాలా బాధనిపించింది. మనిషి ఎంత స్వార్ధపరుడు. తన ఆహారం కోసం జంతువులను వేటాడి చంపేస్తున్నాడు. అపురూపమైన వృక్ష సంపదని అక్రమంగా రవాణా చేసి కోట్లు ఆర్జిస్తున్నాడు.  ఆ అడవిలో దొరికినది తింటూ కాలక్షేపం చేసే పులులు ,ఏనుగుల బలవంతంగా చంపేసి వాటి దంతాల్ని చర్మాల్ని విదేశాలకు ఎగుమత...