శ్మశానవాటిక
శ్మశాన వాటిక నిత్యజీవితంలో మనం కొన్ని ప్రదేశాల పేర్లు తలచుకోడానికి ఇష్టపడం.ఆ పేరు వింటూనే ఏదో అపశకునంగా భావిస్తాం. ఉదాహరణకు రుద్రభూమి . దాన్నే స్మశానం అంటారు. కానీ ఊపిరి లేని వాళ్ళందరూ చివరికి చేరేది ఆచోటే. ఆ చోటుకు చేరుతామని తెలుసు కానీ మనం చేరే రోజు కానీ మనం చేరిన రోజు కానీమనకు తెలియదు. కానీ ఒక కవికి ఆ స్మశాన వాటిక కవితా వస్తువై అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. కవి ఎక్కడకైనా ప్రయాణిస్తాడు. పరకాయ ప్రవేశం చేసి రావలసిన వస్తువు రాబట్టుకుంటాడు. అటువంటి కవులలో చిరస్మరణీయుడు కీర్తిశేషులు గుర్రం జాషువా ఒకరు ఇంటిపేరు గుర్రం వారు . పేరులో ఏముంది పెన్నిధి అనకండి. ఆయన ఆలోచన గుర్రం కంటే వేగంగా పయనించి అద్భుతమైన కవిత కళాఖండాలను సృష్టించాడు. ఒక స్మశాన వాటికను కవిత వస్తువు కింద ఎన్నుకోవడం ఏమిటి అనే ప్రశ్న అందరిలాగే నాకు అనిపించింది . కానీ ఈయన పద్యాలు చదివినప్పుడు ఆనాటి సమాజంలో ఉన్న అస్పృశ్యతను పారద్రోలడానికి పద్యాన్ని ఒక ఆయుధంగా ఈ స్మశాన వాటిక ఒక కవిత వస్తువుగా ఎన్నుకొన్నారు. ఇక్కడ అందరూ సమానులే కులం మతం వర్ణం వర్గం ఏమీ తేడా లేదు ఈ స్థలంలో అంటాడు. అంటే ప్రజల్ని చైతన్య పరచడానికి ఇది ఒక సాధనం. ...