పోస్ట్‌లు

అన్ లిమిటెడ్ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అన్ లిమిటెడ్

అన్ లిమిటెడ్ మధ్యాహ్నం ఒంటిగంట అయింది. ఆ రెస్టారెంట్లోకి అడుగుపెట్టేటప్పటికీ ఎక్కడా ఖాళీ లేదు. ముందుగా మేము రిజర్వ్ చేసుకున్నాం కాబట్టి మేము ఎనిమిది మంది టేబుల్ ఆక్రమించేసా ము. రోజు అదే రోడ్లో అనేకసార్లు ప్రయాణిస్తుంటాం. కానీ ఎప్పుడూ తల పైకెత్తి చూడలేదు. పేరు మటుకు విన్నాం. కొత్తగా కట్టిన షాపింగ్ మాల్లో పెట్టిన రెస్టారెంట్. ఆ నగరానికి అదే మొట్టమొదటి షాపింగ్ మాల్. దానికి తోడు ఎంత తిన్నా కట్టవలసింది ఏడువందల రూపాయలు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు ఆ రెస్టారెంట్ వాడు. అందులో వెజ్ నాన్ వెజ్ రెండు దొరుకుతాయి ఆ రెస్టారెంట్ లో . మామూలు వెజిటేరియన్ మిల్స్ కి ఎంత ఖరీదైన హోటల్ లో అయినా నాలుగు వందలు మించి ఉండదు. కానీ ముక్కల కొరికే వాళ్ళకి ఆ రేటుకి అన్లిమిటెడ్ పెడుతున్నాడు అంటే భలే మంచి చౌక బేరం అనుకుంటారు.  ఏదో కొత్తగా కట్టిన షాపింగ్ మాల్ కదా కొన్నా కొనకపోయినా ఆదివారం పూట కాలక్షేపానికి పిల్లలతో పాటు వచ్చేవాళ్లు వయసు మీరిన వాళ్ళు వయసులో ఉన్నవాళ్లు ఇంక చెప్పకండి ఇంట్లో ఉన్న బామ్మ గారిని తాత గారిని కూడా బయట ప్రపంచంలో తిప్పుదామని సరదా పడే మనవలు కూడా అక్కడ ప్రతి ఫ్లోర్ తిరుగుతూ కనబడ్డ...