రావి చెట్టు
రావిచెట్టు ఏవండీ అప్పారావు గారు రేపు ఉదయం ఈ రావి చెట్టు కొట్టడం ప్రారంభించాలి. ఇంత పెద్ద చెట్టు కొట్టాలంటే కనీసం పది మంది కూలీలు నాలుగు రోజులు సమయం పడుతుంది. దానికి తగిన ఏర్పాట్లు చూడండి అంటూ ఆ అధికారి చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పి కార్ ఎక్కి బయలుదేరి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. సార్ ఈ చెట్టు కొట్టడం లేబర్ వల్ల సాధ్యం కాదు. పట్నం నుంచి కోత మిషన్ తెప్పించాలి. ముందు కొమ్మలు నరికేసిన తర్వాత చెట్టు మొదలు కోత మిషన్ చేత కోయించాలి. పైగా దీని చుట్టూ సిమెంట్ దిమ్మ కూడా ఉంది. ఈ దిమ్మ పడ కొట్టాలంటే బుల్డోజర్ కూడా కావాలి అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు మేస్త్రి అప్పారావు . ఎలా లేదన్న పదిహేను రోజులు టైం పడుతుంది అండి అంటూ చెట్టు పైకి పరిశీలనగా చూశాడు అప్పారావు . సరే అంటూ అధికారి కారు ఎక్కి వెళ్ళిపోయాడు. అబ్బా ఎంత పెద్ద చెట్టు . పెద్ద పెద్ద కొమ్మలు నిండా ఆకులు ఒక రాక్షసుడు లా ఉంది . ఈ గ్రామానికి సరిపడే ఆక్సిజన్ ఇదే సరఫరా చేస్తుందేమో. గాలికి అటు ఇటు ఊగే ఆకులు ఎప్పుడు పెద్ద శబ్దం చేస్తూ ఉంటాయి.దీని వయసు సుమారు వంద సంవత్సరాలు పైగా ఉంటుంది. ఎవరునాటారోమహానుభావులు. . ఆ రోజుల్లో పుణ్...