పోస్ట్‌లు

గురువులు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

గురువులు

చిత్రం
దత్తాత్రేయుడు అంటే హిందూ ధర్మంలో ఒక మహత్తరమైన దేవతా స్వరూపం. ఆయన బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల సమ్మిళిత స్వరూపంగా భావించబడతారు. ఆయనను త్రిమూర్తుల అవతారంగా పూజిస్తారు. మహా పతివ్రత అయిన అత్రి మహాముని భార్య అనసూయని పరీక్షించబోయి త్రిమూర్తులు  అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్లి  అనసూయ దేవిని వివస్త్రగా మరి తమకు ఆతిథ్యం ఇవ్వాలని కోరుతారు. మహా ప్రతివ్రత అయిన అనసూయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురుని పసిబిడ్డలుగా మార్చి వారికి పాలిచ్చి ఆతిథ్యం ఇస్తుంది. దీనితో వారు ముగ్గురు సంతోషించి అనసూయ దేవికి త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుని బిడ్డగా ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోతారు. దత్త అంటే ఇచ్చినవాడు. ఆత్రేయ అంటే అత్రి మహాముని కుమారుడు  అని అర్థం   దత్తాత్రేయుడు త్రిముఖ రూపంలో, మూడు తలలతో, నాలుగు చేతులతో చూపిస్తారు. ఆయన పక్కన ఒక కుక్క (ధర్మానికి సూచిక) మరియు వెనక గోవు (ధర్మప్రతీక) ఉంటాయి. అయితే ప్రతి వ్యక్తి విద్య నేర్చుకోవడానికి ఏదో ఒక గురువుని ఆశ్రయిస్తారు.ఈ మహానుభావుడు  తన చుట్టూ ఉండే ప్రకృతిలోని వస్తువులు జంతువులు తనకి గురువు అంటాడు దత్తాత్రేయుడు. అలా ఇరవై నాలుగు గురువుల దగ్...