పంచభూతాలు
పంచభూతాలు పంచభూతాలన్నీ పరమేశ్వరుడి ప్రసాదం ప్రాణికోటి గమనానికి అవే ప్రాణo. భూమి పొరల నుంచి లేచింది ఒక ప్రాకారం. దాన్ని మోయడానికి భూమికి కావాలి సహనం. సహనంలో ప్రాణికోటికి భూమి కదా ఆదర్శం. చిన్న విత్తును ధాన్యపు రాసి గా మార్చింది ఒక వరి చేను. వరి చేనుకు ఒరిగిందేమీ లేదు పరోపకారం తప్ప. వీచే గాలి ఏమి కోరింది ప్రాణికోటికి శ్వాసను ఇచ్చి కాపాడింది వాయువు లేకపోతే ఇది కాయమే కాదు ప్రాణానికి కొలమానమే వాయువు. ఎర్రటి మంట చూస్తే ఎవరికైనా భయం మంట లేకపోతే పుట్టించలేము అన్నం. అగ్ని సంస్కారంతోటే కాయం పుణ్య లోకాలకు పయనం. హోమాగ్ని లేకుండా పొందలేము దేవతల ప్రసన్నo. తడారిన గొంతుకులకి గుక్కె డు నీళ్ళే కదా ఆధారం. మలినమైన కాయాన్ని జలమే కదా చేస్తుంది పరిశుభ్రం. అందనంత ఎత్తులో ఉంటుంది ఆకాశం. ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని మానవునికి అదే ఆదర్శం. ఏమిచ్చి తీర్చుకోగలం పంచభూతాల ఋణo. దేవతలగా పూజించడమే మానవుల కర్తవ్యం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు. కాకినాడ 9491792279