పోస్ట్‌లు

అమ్మా బొమ్మ కావాలి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అమ్మా బొమ్మ కావాలి

అమ్మా బొమ్మ కావాలి! సాయంత్రం నాలుగు గంటలు అయింది. విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ సందర్శకులతో సందడిగా ఉంది.  ఆరోజు ఆదివారం. కొంతమందికి ఆటవిడుపు. మరి కొంతమందికి ఏరోజైనా ఒకటే.  బ్రతుకు బండి నడవాలంటే  మూడు వందల అరవై ఐదురోజులు ఆ  తీరంలో బ్రతుకు సమరం సాగించవలసిందే. ఆ సాగర తీరంలో ఒక మూలగా దుప్పటి పరుచుకుని దాని నిండా బొమ్మలు పెట్టుకుని పక్కన చంటి బిడ్డను కూర్చోబెట్టుకుని బొమ్మల అమ్ముతోంది ఓ యువతి. అది ఆమె బ్రతుకు సమరం. ఉదయం పూట రహదారి పక్కన సాయంకాలం సాగర తీరం లో బొమ్మలు అమ్మడం ఆమె దినచర్య.  ఉదయమేఇంత ముంత కట్టుకుని షావుకారు దగ్గర బొమ్మలు  తెచ్చుకుని తట్టలో బొమ్మలు పెట్టుకుని ఒక చేత్తో  బిడ్డను నడిపించుకుంటూ బ్రతుకు సమరం ప్రారంభిస్తుంది. సాయంకాలానికి  షావుకారు ఇచ్చిన రోజు కూలీతో బ్రతుకు జీవనం సాగిస్తుంది. ఆమె పేరు నరసమ్మ. ఆమె పక్కనే కూర్చుని ఇసుకలో ఆడుకుంటున్న ఆ పోరడి పేరు రాజు. రాజు ఉదయం నుంచి ఒకటే ఏడుపు. బొమ్మలు కావాలని. పాపం చేతిలో ఎన్నో బొమ్మలు ఉన్న ఒక బొమ్మ కూడా ఆ పిల్లాడికి పిచ్చి ఆడించలేని ఆర్థిక పరిస్థితి ఆమెది. ఒక బొమ్మ ఖరీదుతో ఒకరోజు జీవితం నడిచిపో...