పోస్ట్‌లు

ఆణిముత్యం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆణిముత్యం

ఆణిముత్యం సమాజంలో అనేక మంది వ్యక్తులు రోజు జన్మిస్తుంటారు మరణిస్తుంటారు. కొంతమంది మాత్రమే మన గుండెల్లో సజీవంగా ఎప్పటికీ ఉంటారు. రక్తసంబంధీకులు సరే. మరి ఆయనతో మనకున్న సంబంధం ఏమిటి అని ఆలోచిస్తే ఆయన ఒక వేద పండితుడు మా వివాహాలన్నీ ఆయనే చేయించారు అనేకమంది శిష్యులకి ఇంత విద్య నేర్పి తన కాళ్ళ మీద తాము నిలబడేలాగా దారి చూపించిన మహానుభావుడు, మా నాన్నగారికి ఆప్త మిత్రుడు అని ఇలా రకరకాల కారణాలు చెప్పొచ్చు.ఆయన చిరునామా ఎవరికీ చెప్పక్కర్లేదు. వివరాలు కూడా చెప్పనవసరం ఎందుకంటే తన విద్యతో అందరి మనసుల్ని ఆకర్షించిన మహోన్నత వ్యక్తి. ఇంకెవరు ఆ గ్రామంలో ఉన్న ఏకైక వేద పండితులు బ్రహ్మశ్రీ తాతపూడి రామకృష్ణ అవధానులు గారు. కాకినాడ జిల్లాలోని కాజులూరు మండలంలోని పల్లిపాలెం గ్రామ నివాసి ఆ గ్రామంలో అడుగుపెడుతుంటేనే వేదం నాదం రెండు ముందుగా పలకరించేవి నిన్నటి వరకు. నేడు ఆ ప్రదేశం సందర్శించగానే ఒక్కసారి నిశ్శబ్దం అంతా ఆవరించి ఉంది. ఏ మూల నుంచి అయినా వేదనాదం కాని సంగీత స్వరంగాని వినపడుతుందని ఆశగా చూస్తే మౌనమే అక్కడ రాజ్యమేలుతోంది. ఎప్పుడూ తోటలోని మామిడి చెట్టు క్రింద కానీ అరుగు మీద కానీ తన శిష్యులకు పాఠం బోధించే గు...