రంగుల పండుగ
రంగుల పండుగ ఇది రంగుల పండుగ. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుని సంతోషం ప్రకటించే పండుగ. పండగ అంటే ఏమిటి సాధారణంగా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా పండగలు చేసుకుంటాం. పరమ విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు రాక్షస రాజైన హిరణ్యకశిపుడు కొడుకు. రాక్షసులకి విష్ణువు శత్రువు. తన కుమారుడు విష్ణువుని ఆరాధించడం హిరణ్యకశిపుడికి ఇష్టం ఉండదు. విష్ణు మీద ప్రేమ పెంచుకోవద్దని ప్రహ్లాదుని అనేక బాధలు పెడతారు. చివరికి రాక్షస రాజు చెల్లెలు హోళికాదేవి ప్రహ్లాదుడిని మంటలలో పడవేస్తుంది. దైవానుగ్రహం వలన విష్ణు మాయ వలన ప్రహ్లాదుడు తప్పించుకోగలుగుతాడు. కానీ హోలికాదేవి మంటలలో మాడి మసైపోతుంది. ఆరోజు చైత్ర శుద్ధ పౌర్ణమి. ఆరోజునే హోలీ పండగ జరుపుకుంటాం. సాధారణంగా పెళ్లికి లేదా పండగ సమయంలో మనం నివసించే ఇంటికి రంగులు వేసుకుంటా ము. అది శుభకరం. ఏ వేషానికి తగినట్లు ఆ వేషానికి రంగుల పూసుకుని రంగస్థలం ఎక్కుతారు కళాకారులు. అలా ఒంటికి పూసుకున్న రంగుల తోటి పరకాయ ప్రవేశం చేసి రెండు మూడు గంటలసేపు ఆడే నాటకం కడుపుకి వారికి ఇంత అన్నం పెడుతుంది. ఆ రంగస్థలం మీద కళాకారుడు ఆడే నాటకం ప్రేక్షకులకు ఆనందం తెచ్చిపెడుతుంది. రం...