మాతృ దినోత్సవం
మాతృ దినోత్సవం. " దేవుడు అమ్మని ఎందుకు పుట్టించాడో తెలుసా. అన్నిచోట్ల దేవుడు ఉండలేక. అంటే అమ్మ దేవుడికి ప్రతిరూపం. అమ్మకి మనకి సంబంధం ఎవరు నిర్వచించలేనిది. 9 నెలలు కడుపులోనూ భూమి మీద పడిన తర్వాత అమ్మ కనుమూసే వరకు ఆ బంధం కొనసాగుతూనే ఉంటుంది. బొడ్డు కోసి వేరు చేసినంత మాత్రాన మనకి అమ్మకి ఉన్న సంబంధం తెగిపోదు. అమ్మ మన ఇంట్లో ఉన్న దేవుడు. బాల్యంలో అమ్మానాన్న మనం ఒకటే. రూపాలే వేరు. మనం గట్టిగా ఏడిస్తే అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు. బోసి నవ్వులు నవ్వుతుంటే ఆ నవ్వులు చూసి అమ్మ కళ్ళల్లో వెలుగు. బాల్యంలో మన లాలన పాలన అంతా అమ్మే. నిప్పుకి ,ఉప్పుకి తేడా తెలియదు వాటిని బూచిలా చూపించి దూరంగా ఉంచేది. ఏది తప్పు ఏది ఒప్పు ఉగ్గుపాలతో నేర్పించేది అమ్మ. బంధాలు బంధుత్వాలు మనకు తెలియవు. చూపుడు వేలుతో నాన్నని చూపించేది అమ్మ. నాన్నకు రికమండేషన్ చేసి నాన్నకు తాహతకు మించిన స్కూల్లో చేర్పించేది అమ్మ. నాన్నకి మనకి మధ్య వారధి అమ్మ. తను కొవ్వొత్తి లా కరిగిపోతూ మన బ్రతుకులో వెలుగులు పంచేది అమ్మ . అందుకే అమ్మంటే కనిపించే దైవం అంటూ విద్యార్థులను ఉద్దేశించి సుదీర్ఘ ఉపన్యాసమిచ్చి తన సీట్ లో కూర్చున్నాడు ప్రిన్సిపాల్...