పోస్ట్‌లు

కొత్త లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కొత్త జీవితానికి కొత్త దారి

" కొత్త జీవితానికి కొత్త దారి" " హమ్మయ్య నాకు ఇవాళ తోటి అన్ని బాధ్యతలు తీరిపోయాయి. ఇంక నేను రేపటి నుంచి స్వేచ్ఛ జీవిని. ఒకరు గురించి భయపడక్కర్లేదు. ఒకరి గురించి ఆలోచించక్కర్లేదు అని అంటూ నాలిక కరుచుకున్నాడు రాఘవరావు. తప్పు మాట నేను బ్రతికున్నంత కాలం నీ బాధ్యత నాదే. అలాగే నా మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత నీది అంటూ అలా వసంతతో చెప్తూ విశ్రాంతిగా పడక కుర్చీలో పడుకున్నాడు రాఘవరావు.  రాఘవరావు ఒక ప్రభుత్వ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తుండేవాడు. చిన్న కుటుంబం ఇద్దరు పిల్లలతో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. రెక్కలొచ్చిన పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసి ఇద్దరు మనవళ్ళకి తాతయ్యేడు రాఘవరావు. అమెరికా చూపిస్తానని కొడుకు ఆనంద్, ఆస్ట్రేలియా చూపిస్తానని కూతురు డాక్టర్ సునంద బ్రతిమాలిన ఇల్లు కదల్లేదు రాఘవరావు. రిటైర్ అయిన దగ్గర్నుంచి భార్యతో ఆనందంగా కాలక్షేపం చేస్తూ గుడి గోపురం అంటూ తిరుగుతూ భార్యకి వంటింట్లో సహాయకారిగా ఉంటూ ఆదర్శవంతమైన రిటైర్డ్ ఉద్యోగి లాగ ఉండేవాడు రాఘవరావు.   పిల్లల మీద ప్రేమ లేక కాదు గాని వారు ఫోన్ చేసినప్పుడే వాళ్లతో మాట్లాడటం మామూలుగా ఖాళీగా ఉన్నాం కదా అని ఆస్తమాను ఫోన...