కార్తీక్
కార్తీక్ " చూడండి ఈ బాబు మానసికంగా ఎదుగుదల చాలా తక్కువగా ఉంది. దీనికి ఏమి వైద్యం లేదు. అందుకే ఈ వయసు లో రావలసిన ఆటపాట ఆలస్యంగా వస్తున్నాయి. కానీ శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నాడు అంటూ పిల్లల వైద్యుడు చెప్పిన మాటలకి పిల్లవాడు కార్తీక్ తల్లి రాధ బుర్ర తిరిగిపోయింది. తర్వాత డాక్టర్ చెప్పిన మాటలు ఏమి వినపడలేదు. ఆటోలో ఇంటికి వచ్చేసి మంచం మీద పడుకుని ఆలోచనలలో పడింది. పుట్టినప్పుడు ఎంత అందంగా ఉన్నాడు. అందాల చందమామలా ఉన్నాడు. కార్తీక పౌర్ణమి నాడు పుట్టాడు. అందుకే పున్నమి చంద్రుడిలా ఉండేవాడు. గిరజాల జుట్టు తెల్లటి రంగు పొడవైన వేళ్ళు, కాళ్లు చేతులు అబ్బా తలుచుకుంటేనే ముద్దొచ్చేలా ఉండేవాడు. పుట్టి ఏడాది పైన అయినా ఆ వయసు వాళ్లకు ఉండవలసిన లక్షణాలు లేకపోవడంతో డాక్టర్ గారి దగ్గరికి తీసుకు వెళితే తెలిసిన నిజం. రాధ అత్తగారు రోజు సాధిస్తూనే ఉంది. పిల్లవాడు ఏమిటి ఇలా ఉన్నాడని. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి పిల్లలు మా ఇంట్లో పుట్టలేదు అంటూ రోజు ఒకటే గోల. పాపం కనిపెట్టుకోలేకపోయింది రాధ . అత్తగారు అనుభవంతో కనిపెట్టింది. అత్తగారు ఇప్పుడు ఏమంటుందో ఏమో. భర్త ఈ విషయం ఏ విధంగా తీసుకుంటాడో అనుకుంటూ ఏడుస్...