పోస్ట్‌లు

ఆ రోజుల్లో లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆ రోజుల్లో

ఉదయం ఎనిమిది గంటలు అయింది. నిండా పదేళ్లు కూడా లేని మనవరాలు "అమ్మ స్కూలుకు టైం అయిపోతోంది ! అని ఊరికే తొందర పెడుతుంది. వంటింట్లో చెమటలు కక్కుతున్న నా కూతురు వస్తున్నా ఉండవే! బయటికి గబగబా వచ్చి బాత్రూంలోకి పిల్లల్ని లాక్కుపోయింది. కాసేపు పిల్ల ఏడుపు తల్లి సముదాయింపు వెరసి తయారైన పిల్లనీ తీసుకుని తల్లి బయటికి వచ్చింది.  ఆ కాన్వెంట్ విద్యార్థిని చూస్తే ఆశ్చర్యమేసింది! స్కూలు యూనిఫామ్, మెడలో టై, స్కూల్ బ్యాడ్జి, కాళ్లకు బూట్లు సాక్సులు చేతికి స్కూల్ బ్యాగ్ , బ్యాగులో బరువైన పుస్తకాలు, పెన్సిల్లు రబ్బరు ఇరేజర్ పెట్టుకోవడానికి ఒక చిన్న పెట్టే, క్యారేజీ కి ఒక సంచి, నిండా నీళ్లతో ఒక వాటర్ బాటిల్, మధ్యలో స్నాక్స్ ఇది స్కూలుకు వెళ్లే విద్యార్థి అవతారం.  ఆ స్కూల్ బ్యాగ్ పైన రకరకాల బొమ్మలతో చాలా ఆకర్షణీయంగా ఉంది. " స్కూల్ బ్యాగ్ చాలా బాగుంది అన్న నా ప్రశంసకి సమాధానంగా మా అమ్మాయి ఏముంది నాన్న ప్రతి ఏటా కొత్త బ్యాగు కొనడమే అంది. మొత్తానికి తల్లి, పిల్ల నోట్లో అన్నం కుక్కి ఏదో మాయ మాటలు చెప్పి సందు చివర స్కూల్ బస్సు ఎక్కించి వచ్చింది. మా అమ్మాయి మొహం లో ఎంతో రిలీఫ్ కనబడింది. ఇంతకీ అది చదివ...

ఆ రోజుల్లో ఆదివారం

ఆ రోజుల్లో ఆదివారం ఆదివారం మిట్ట మధ్యాహ్నం అయిందంటే చాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి అతుక్కుపోయి మైమరిచిపోయి ఆ గళం లో గాథలన్నీ విని తమ బాధలన్నీ ఆ సమయంలో మరిచిపోయి అయ్యో అప్పుడే అయిపోయిందా అని నిట్టూర్చి వచ్చే ఆదివారం కోసం ఎదురుచూపులు చూసే అభిమానులు కోకొల్లలు ఆ గళానికి .ఆ గళంలో సుమధుర స్వరం ఉంది. అది నాదస్వరమై బుసలు కొట్టే వారిని కూడా బుద్ధిమంతులుగా చేసింది. యావత్ ప్రపంచాన్ని ఆ గళానికి అభిమానులుగా చేసింది. ఈ మాయా లోకంలో కొట్టుమిట్టాడుతున్న సమాజానికి ఏది మంచి ఏది చెడు చెప్పే ఆ స్వరం కొంతమందికి తమ అనుకరణ విద్యలో భాగంగా చేరిపోయింది. ఆయన ఇంటి పేరు పురాణపండ. పేరు సూర్య ప్రకాశ దీక్షితులు. నమ్ముకున్న సాహిత్యం చదువుకున్న సంస్కృతo వారసత్వంగా వచ్చిన పాండిత్యం, భగవంతుడిచ్చిన గళం ఆయనని తన వృత్తిలో సూర్యుడిలా ప్రకాశింపజేసింది. రామాయణ మహాభాగవత భారత గాధలను ప్రజలకు తనదైన శైలిలో వినిపించడం ఆయనకి ఒక దీక్ష .ఎప్పుడో త్రేతా యుగంలో జరిగిన రాముడి కథ ద్వాపర యుగంలో పుట్టిన ఆ నీ ల మేఘశ్యాముడు లీలలు , కౌ రవ పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం మన కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా చెప్పడo ఆయన ప్రత్యేకత.  మ...