గంగిరెద్దు
 
స్త్రీలకు అలంకరణ  అందాన్నిస్తుంది. ఎవరైనా అతిగా అలంకరించుకుంటే గంగిరెద్దులతో పోలుస్తారు. చెప్పిన మాటల కల్లా తల ఊపుతుంటే గంగిరెద్దులా తలాడిస్తోంది అంటారు. కారణం ఏమిటంటే ప్రతి సంక్రాంతి పండుగకి ప్రతి  వీధిలోను దర్శనమిచ్చే గంగిరెద్దు విచిత్ర అలంకరణలతో దర్శనమిస్తుంది. గంగ రెద్దు  కొమ్ములు దగ్గర నుండి మోపురం వరకు ప్రతి అవయవం అందంగాఅలంకరిస్తారు.  ఈ గంగిరెద్దులవారు సంచార జాతికి చెందినవారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలోనే దర్శనమిస్తారు. ఎద్దును తీసుకుని ఊరురా తిరిగి జీవనం గడుపుకుంటారు. సరే వీరికి ఎద్దు ఎలా వస్తుంది అనే ప్రశ్న మదిలో మెదులుతుంది.   సింహాచలము వేములవాడ వంటి దేవస్థానాల్లో కోడెదూడలను దేవుడికి కానుకగా ఇచ్చి మొక్కులు తీర్చుకునే ఆచారం ఒకటి ఉంది. ఆ దేవస్థానం దగ్గర నుంచి ఈ గంగిరెద్దుల వారు కోడెదూడలను కొనుక్కుని ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆట  నేర్పి సన్నాయితో  యజమాని పాడే పాటకు అనుగుణంగా ఎద్దు తలలూపుతూ విన్యాసాలు చేస్తుంది. యజమాని మాట ఎంతవరకు అర్థమైందో తెలియదు కానీ అయిందానికి కాని దానికి ఎద్దు తల ఊపుతుంది. ఆ నోరులేని మూగ జీవి యజమానికి ఇంత అన్నం సంపాదించి పెడుతుంది. ఇలా ప్రతి సంక్రాంతి పం...