పోస్ట్‌లు

ఆడపిల్ల లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆడపిల్ల

అమ్మను మించిన అమ్మ యుగానికో రాక్షసుడిని చంపడానికి అవతారం ఎత్తినా , ఇంకా నరరూప రాక్షసులు కళ్లు నిన్ను వెతుకుతూనే ఉన్నాయి. ఎంతమంది సజ్జనారులు వలయాలు గీసినా, అవి నీకు రక్షిత వలయాలు మాత్రం కాలేకపోయాయి. అమ్మ రక్షరేకులు కట్టించిన నీ మీద రాక్షస దృష్టి పడుతూనే ఉంది.నువ్వు జంతువు కాదు, జూలో ఉంచలేను. నువ్వు లక్ష్మణరేఖలు దాటకపోయినా, రాక్షసులే నీ తలుపు తడుతూనే ఉంటే — కాపాడవలసిన కాళిక కళ్లు తెరవకపోతే — నీకు ఎవరు రక్ష? ప్రభుత్వ చట్టాలు అందరికీ చుట్టాలే. సమాజమే నీకు శత్రువు. నీ మానాన నిన్ను బ్రతకనివ్వడం లేదు. సైన్స్, టెక్నాలజీ రెండూ నీకు శత్రువులే. గర్భస్థ పిండంలోనే నీ పీక పిసికితున్నారు. సృష్టి ఆపే శక్తి ఆ పరమేశ్వరుడికి తప్ప ఎవరికీ లేదు. అమ్మ నాన్న నిత్యం జాగ్రత్తల దండకం చదువుతూ, డ్రెస్సింగ్ రిహార్సల్ వందసార్లు చేస్తూ, బడికి పంపుతూ — నువ్వు తిరిగి వచ్చేవరకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ — నిత్యం దేవుడిని ప్రార్థిస్తూ భయంగా బ్రతుకుతున్నారు. చదువు కంప్లీట్ చేయించి, క్యాంపస్ నుండి ఆఫీస్ మెట్లెక్కించి, ఒక అయ్య చేతిలో పెట్టి హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. పెళ్లి లాటరీ లాంటిది. ఏ నంబరు లక్కీ నంబరో ముందే తెలి...