వాచ్ మెన్
మధ్యాహ్నం రెండు గంటలు అయింది. ఆకాశం అంతా దట్టంగా నల్ల మబ్బు పట్టి, ఒకటే ఈదురు గాలులు. "ఏమిటి వర్షం వస్తుందా?" అనుకుంటూ సుమతి కుర్చీలోంచి లేచి, మేడ మీద ఆరవేసిన బట్టలు తీసుకు రావడానికి వెళ్లింది. మేడ మీద ఆరవేసిన బట్టలు తీసుకుని లిఫ్ట్‌లో నాలుగో ఫ్లోర్‌కి వస్తుండగా, చేతిలో సెల్‌ఫోన్ రింగ్ అయ్యింది. "హలో!" అనగానే... "సుమతి! పిల్లలు ఇంటికి వచ్చారా? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? ఇంట్లో సామాన్లు అన్నీ ఉన్నాయా? ఫ్రిజ్‌లో పాలు ప్యాకెట్లు ఎన్ని ఉన్నాయి? కూరగాయలు ఉన్నాయా? పిల్లలకు తినడానికి ఏమైనా ఉన్నాయా?" అంటూ కంగారుగా ప్రశ్న మీద ప్రశ్నలు అడుగుతున్నాడు సుమతి భర్త సుధాకర్. "ఏంటండీ? మీరు ఇలాంటివి ఎప్పుడూ అడగరు కదా! నేనే కదా బజార్ నుంచి తెచ్చుకుంటాను," అంటూ నిష్టూరంగా మాట్లాడిన భార్య మాటలకు కోపం తెచ్చుకోకుండా... "నువ్వు టీవీ చూడటం లేదా? రేపు మన విశాఖపట్నానికి చాలా ప్రమాదకరమైన తుఫాను వస్తోంది. సిటీ చాలా హడావుడిగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా తుఫాను ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రేపు అన్ని స్క...