పోస్ట్‌లు

సతులార లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సతులార

సతులారా చూడరే   సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమిl   సకలాయ నడిరేయ కలిగే శ్రీకృష్ణుడు  అంటూ అన్నమయ్య తన కీర్తనల్లో శ్రీకృష్ణుడి పుట్టుక గురించి స్తుతించారు. శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజుగా  పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పండుగను మనం కృష్ణాష్టమి గా జరుపుకుంటాం.  చెరసాలలో దేవకి వసుదేవుల కుమారుడుగా జన్మించి రేపల్లెలో నందుని ఇంటిలో యశోదమ్మ ఒడిలో పెరిగి నంద కుమారుడుగా చలామణి అయ్యాడు పోతన్న గారు ఆంధ్ర మహాభాగవతంలో శ్రీకృష్ణుని రూపం గురించి చెప్తూ నల్లని వాడు పద్మనయనములు కలవాడిగా వర్ణించారు. అన్నమయ్య ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు అంటూ స్తుతించాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణ అవతారం ఎత్తిన విష్ణుమూర్తి పసిప్రాయం నుండి తన లీలలు చూపించి రేపల్లెవాసుల్ని ఆశ్చర్యపరిచాడు. పాలు తాగే వయసులో కృష్ణుడిని చంపడానికి మేనమామ కంసుడు పంపించిన పూతన అనే రాక్షసిని రొమ్ము పీల్చి సంహరించాడు. ఇక్కడ భగవంతుడు మాయ మనం గమనించాలి. సాధారణంగా చంటి పిల్లలకి తల్లి దగ్గర తప్పితే ఇతర స్త్రీల దగ్గర ఎవరూ పాలు ఇప్పించడానికి ఇష్టపడరు. ఆ రాక్షస సంహారం జరగాలి కాబట్...