పోస్ట్‌లు

పుట్టిన రోజు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పుట్టిన రోజు

పుట్టినరోజు " హ్యాపీ బర్త్ డే రా సుధాకర్ అంటూ ఆఫీస్ కి రాగానే కొలీగ్స్ అందరూ సుధాకర్ చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ తిరగడం ప్రారంభించారు. అందరికీ థాంక్స్ చెప్పి సుధాకర్ తన సీట్లో కూర్చున్నాడు. అదొక ప్రభుత్వ రంగ బ్యాంకు కార్యాలయం అక్కడ పనిచేసే పదిమంది ఉద్యోగు లు మేనేజర్ దగ్గర నుంచి సబ్ స్టాప్ వరకు ఏ నెలలో ఎవరు పుట్టినరోజులు వచ్చాయో క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకుంటారు. ఆరోజు ఎవరిదైతే పుట్టినరోజు వస్తుందో వాళ్లు హోటల్ లో లంచ్ ఇవ్వాలి. లంచ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ కేక్ కట్ చేసి తర్వాత ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటారు. అలా ప్రతినెల ఎవరిదో ఒకరికి పుట్టినరోజు వస్తూనే ఉంటుంది. రేపు పుట్టినరోజు అనగా ముందు రోజు అందరికీ లంచ్ కి రమ్మని ఎవరిదైతే పుట్టినరోజు అవుతుందో వాళ్ళు ఆహ్వానిస్తారు. ఇది ఆఫీస్ సాంప్రదాయం కానీ సుధాకర్ పుట్టినరోజు ముందు రోజు అటువంటి ఆహ్వానం అందలేదు. అదేంటి రేపు సుధాకర్ పుట్టినరోజు కదా మర్చిపోయాడా ఏమిటి ఎవరికీ చెప్పలేదు కనీసం మేనేజర్ గారికి అయినా చెప్పాడా అని ఎదురుచూసిన సహ ఉద్యోగులు ఆశ నిరాశ అయింది. ఆఫీస్ కి వచ్చిన తర్వాత కూడా సుధాకర్ ఆ లంచ్ మాట ఎత్తలేదు. కానీ అం...