పోస్ట్‌లు

అసాధ్య సాధక స్వామి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అసాధ్య సాధక స్వామి

 *అసాధ్య సాధక స్వామి* "అసాధ్య సాధక స్వామి  అసాధ్యం తవకిన్ వధ  రామదూత కృపా సింధో మత్ కార్యం సాధయ ప్రభో' " మన జీవితంలో ఏదైనా తలపెట్టిన పని ఏదో ఒక కారణం వలన జరగనప్పుడు, వాయిదా పడుతున్నప్పుడు మనం ఈ శ్లోకంతో స్వామిని ఆరాధిస్తే అసాధ్యమైన పనులు సాధించిన ఆంజనేయ స్వామి మనల్ని కరుణించి పనులు సానుకూలం చేస్తాడని అని పెద్దలు చెప్పిన శ్లోకం. ఈ శ్లోకం ఎవరు రాసారో నాకు తెలియదు.  అయితే ఆంజనేయస్వామి రామబంటుగా అతి బలవంతుడిగా సీతమ్మ వారి జాడ కనుగొన్న వాడిగా , సముద్రాన్ని అవలీలగా దాటిన వాడిగా, లంక జాడ కనిపెట్టిన వాడిగా మన మనసులో ముద్ర వేసుకొని ఉన్నాడు.   మనకు భయం వేసిన , జ్వరం వచ్చిన , చిన్నప్పుడు అమ్మ ఆంజనేయ స్వామి సింధూరం నుదుటను పెట్టి ఆంజనేయ స్తోత్రం చదివి వినిపించడం మనకు అందరికీ బాల్యంలోనే ఒక అద్భుత అనుభవం.  అప్పటినుంచి మనకి భయం పోగొట్టేవాడుగా ఆంజనేయుడు మన మనసులో ముద్ర వేసుకున్నాడు. దాని తోడు ఆకారం కూడా అలాగే ఉంటుంది. ఆ ఆకారం చూస్తే మనకు సగం భయం తగ్గిపోతున్నట్లు అనిపిస్తుంది. అయితే ఆంజనేయ ఆరాధన వలన కలిగే ఫలితాలు మనకి పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. బాగానే ఉంద...