పలకని మొబైల్
పలకని మొబైల్ ఉదయం 10:00 గంటలు అయింది అప్పుడే మార్కెట్లోని షాపులన్నీ తీస్తున్నారు. రోడ్డుమీద ఎక్కువగా జనం లేరు. ఎప్పటిలాగే శంకరం తన మొబైల్ షాప్ తలుపు తీస్తున్నాడు. మొబైల్ అమ్మకాలతో పాటు రిపేర్లు కూడా చేస్తుంటాడు శంకరం షాప్ అంతా శుభ్రం చేసి సీట్లో కూర్చుని చుట్టూ పరికించి చూశాడు. ఎక్కడ చూసిన మొబైల్ కనపడుతున్నాయి. మొబైల్ కూడా నిత్యవసర వస్తువుల తయారైంది. రోజు రిపేర్ కోసం అని, మొబైల్ లు కొత్తవి తీసుకోవడానికి జనం వచ్చి పోతుంటారు. మార్కెట్లో కొత్త మోడల్ వచ్చిందంటే కొంతమంది పాతవి అమ్మేస్తుంటారు. నిత్యజీవితంలో మొబైల్ అవసరం ఎంత బాగా పెరిగిపోయింది అంటే అది లేకుండా జీవితం గడపడం కష్టం అయిపోయింది. మనిషిలా తోడుగా ఉంటుంది. కబుర్లు మోసుకొస్తుంది. మనసుకు ఆనందపరుస్తుంది. అలాంటిది మొబైల్ ఒక రోజు పని చేయకపోతే పిచ్చెక్కిపోతుంది. అలాగే ఉంది పరమేశ్వర రావు పరిస్థితి. అప్పుడే నెల రోజుల నుంచి మొబైల్ ఉలుకు పలుకు లేదు . అసలు రింగ్ రావట్లేదు. ఏం పాడయిందో ఏమిటో! పోనీ రిపేర్ కి తీసుకెళ్దాం అంటే ఈ ఆశ్రమం నుంచి రిపేర్ షాప్ నాలుగు క...