పార్టీ
పార్టీ  రంగ మ్మా   ఈరోజు రాత్రి మన ఇంట్లో పార్టీ ఉంది. అయ్యగారి బంధువులు స్నేహితులు చాలా మంది వస్తారు. గుమ్మానికి బంతిపూల దండలు కట్టు. కర్టెన్ లన్ని  మార్చెయ్యి. ఇల్లంతా తడి గుడ్డు పెట్టు . డైనింగ్ టేబుల్ మీద పింగాణీ సామానంతా పెట్టు. వాటర్ బాటిల్స్ తెప్పించు.భోజనంలోకి ఒక స్వీట్  హాట్  బిర్యాని సాంబార్ అన్నం ఒక వేపుడు అప్పడాలు వడియాలు రెడీ చెయ్యి అంటూ గబగబా చేయవలసిన పనులు లిస్టు చెప్పేసింది  ఆ లంకంత కొంపకి యజమానురాలు సుమిత్ర. సుమిత్ర భర్త సుధాకర్ గారు పెద్ద సివిల్ కాంట్రాక్టర్. చాలా పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు. బాగా సంపాదించాడు. సుమిత్ర గారికి ఇద్దరు మగపిల్లలు. సిటీలో బాగా పేరు మోసిన స్కూల్లో చదువుకుంటున్నారు. రంగమ్మ కూడా అదే కాలనీలో   గెడ్డ పక్కన  రేకుల షెడ్డులో కాపురం ఉండి ఆ చుట్టుపక్కల పది ఇ ళ్లలో పాచి పని చేసుకుంటూ పిల్లల్ని  చదివించుకుంటూ కాలక్షేపం  చేస్తోంది. భర్త ఆటో నడుపుకుంటూ ఉంటాడు. సుమిత్ర గారికి పిల్లల్ని బయటకు పంపించడం భయమేసి రంగమ్మ పిల్లల్ని క్రికెట్ ఆడుకోవడానికి రమ్మంటారు ప్రతి ఆదివారం .సుమిత్ర గారి పిల్లలతో రంగమ్మ పిల్లలు  రాజు ,రవి క్రికెట్ ఆడుకుంటూరు. క్రమేపి వాళ్...