పోస్ట్‌లు

అమ్మ ఇలాగే లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అమ్మ ఇలాగే ఉంటే బావుంటుంది

అమ్మ ఇలా ఉంటే బాగుంటుంది. ఉదయం 5:00 అయింది. కాలింగ్ బెల్ అదేపనిగా మోగుతుంటే నిద్రలోంచి మెలకువ వచ్చి వీధి తలుపు తీయగానే చేతిలో బ్యాగు పట్టుకుని గుమ్మoల్లోకి అడుగుపెట్టిన కూతురు సుజాతను చూసి ఆశ్చర్యపడింది సుజాత తల్లి అరుణ. సుజాత డైరెక్ట్ గా తన గదిలోకి వెళ్లి మంచం మీద పడుకుంది. ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసింది ఏమిటి? మళ్లీ అల్లుడు గారితో దెబ్బలాడి వచ్చేసి ఉంటుంది. పెళ్లయిన మూడేళ్లలో ఇలా రావడం నాలుగోసారి. ప్రతిసారి అల్లుడు వచ్చి బ్రతిమాలి తీసుకెళ్లడం మామూలు అయిపోయింది అనుకుంటూ సుజాతనేమీ అడక్కుండా "అమ్మా సుజాత మొహం కడుక్కుని రా కాఫీ పెడతా ను తాగి పడుకుందువు గాని అంటూ చెప్పిన తల్లికి ఏమి సమాధానం చెప్పకుండా కళ్ళు మూసుకుని పడుకుండిపోయింది సుజాత.  ఇంతలో అరుణ భర్త రామారావు లేచి ఎవరు బెల్లు కొట్టింది అంటూ ప్రశ్నించేసరికి మన అమ్మాయి వచ్చిందండి అని అరుణ సమాధానమిచ్చి వంట గదిలోకి వెళ్ళింది. అయినా ఇలా సమయం సందర్భం లేకుండా అమ్మాయి ఎందుకు వచ్చిందని మనసులో అనుకుని ఓహో మళ్లీ అల్లుడు కథ మామూలే అనుకుని రామారావు బాత్రూంలోకి వెళ్లిపోయాడు.  సుజాత కి పెళ్లి అయ్యి మూడేళ్లయింది. భర్త సురేష్ సాఫ్...