పోస్ట్‌లు

ఇల్లు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఇల్లు

ఇల్లు " అబ్బా రోజు మన చెట్ల మీద వాలి కావు కావు మంటూ అరిచే కాకులు అదేమిటి రెండు రోజుల నుంచి ఎక్కడా కనబడలేదు. గోడ మీద నిన్న పెట్టిన అన్నముద్ద అలాగే ఉంది. ఈవేళ అన్న ముద్ద పెట్టిన ఆకాశంలో ఎక్కడా కాకిజాడ కనపడట్లేదు. మనసేమీ బాగుండట్లేదు. ఊరంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. చనిపోయిన భవాని శంకర్ గారు ఏదో తీరని కోరికతో పోయారు. అది కోరికో లేకపోతే భయమో ఎవరికి ఏమి చెప్పలేదు. ఆయన పోయి అప్పుడే రెండు రోజులైంది. ఆయనకు తీరని కోరికలు ఏముంటాయి. కడుపుని పుట్టిన ఆరుగురు మగ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలకి మనవలు కూడా పుట్టేశారు. అందరూ కోటీశ్వరులు కాకపోయినా ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు. ఆయన మీద ఆధారపడి న వాళ్లు ఇద్దరే ఇద్దరు. ఒకరు భవాని శంకరం గారి భార్య రెండవది మొగుడు వదిలేసిన కూతురు. వాళ్ళిద్దరికీ బతకడానికితగిన ఏర్పాట్లు ముందుగానే చేసేసాడు భవాని శంకర్ గారు. పిల్లలందరూ తండ్రి కార్యక్రమాలన్నీ యధావిధిగానే చేస్తున్నారు. మరి కాకి అన్నo ముద్ద ఎందుకు తీసుకెళ్లడం లేదు ఎవరికీ అర్థం కాని ప్రశ్న అలా ఎవరిలో వాళ్లు బాధపడుతూ కార్యక్రమాలు నడిపిస్తున్నారు.  అలా పన్నెండు రోజులు గడిచిపోయాయి కానీ ఏనాడు కాకి అన్నం ముద్ద త...