పాండవుల మెట్ట
పాండవుల మెట్ట కాకినాడ జిల్లా పెద్దాపురం చారిత్రాత్మకంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న పట్టణం. ఒకప్పుడు ఇక్కడ పట్టు బట్టలు నేసే చేనేత పని వారు ఉండేవారు. అది పెద్దాపురం సిల్క్ గా ప్రసిద్ధి చెందింది. అయితే సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అనేక యంత్రాలతో తయారైన వస్త్రాలతో ఇవి పోటీ పడలేక మరుగున పడిపోయేయి. అయితే ఈ గ్రామంలో ఉన్న మరొక విశేషం మరిడమ్మ అమ్మవారి గుడి. ఆషాడ మాసంలో ఒక నెలరోజుల పాటు జరిగే తీర్థానికి అమ్మవారి జాతర్లకి చుట్టుపక్కల గ్రామాల నుండి ఎంతోమంది భక్తులు వచ్చి తమ మ్రొక్కులు తీర్చుకుంటారు. అలాగే ఇక్కడ ఒక సూర్యనారాయణమూర్తి దేవాలయం కూడా ఉంది. ఆధ్యాత్మికంగా పెద్దాపురం ఈరకంగా ప్రాముఖ్యత సంతరించుకుంటే చారిత్రాత్మకంగా కూడా పెద్దాపురం చరిత్రలో నిలిచిపోయింది. అదే పాండవుల మెట్ట అనే స్థలం. ఇది మహాభారత కాలంలో అజ్ఞాతవాసo సమయంలో పాండవులు నివసించిన ప్రదేశంగా ప్రజలు విశ్వసిస్తారు. దానికి తగినట్లుగా కొన్ని ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయి. వాటిని పాండవుల గుహలు అంటారు. పూర్వకాలంలో పెద్దాపురం నుంచి రాజమండ్రి వరకు సొరంగ మార్గం ఉండేదని అది ప్రస్తుతం మూసి వేయబడిందని చెప్తుంటారు. అలాగే ఈ కొం...